photo share
-
అతీక్ అహ్మద్ లాయర్‌కు మరో షాక్! ఫొటోలు షేర్ చేశాడని క్రిమినల్ కేసు
లక్నో: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ ఖాన్ సౌతల్ హనీఫ్పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఉమేష్ పాల్ ఫొటోలను ఇతను అతీక్ కుమారుడు అసద్‌కు పంపినట్లు తెలిపారు. ఆ మరునాడే ఉమేశ్ దారుణ హత్యకు గురయ్యాడు. అసద్ మరికొందరితో కలిసి ఉమేష్‌ను ఇంటిబయటే కాల్చి చంపాడు. ఉమేశ్‌పాల్ హత్యకు సంబంధించి క్రిమినల్ కాన్స్పిరసీ అభియోగాలతో హానీఫ్‌పై సెక్షన్ 120-బీ కింద ధుమన్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డీసీపీ దీపక్ భూకార్ వెల్లడించారు. ఉమేశ్ కిడ్నాప్ కేసుకు సంబంధించి హానీఫ్కు ఇప్పటికే యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. ప్రస్తుతం నైని కేంద్ర కారాగారంలో ఉన్నాడు. ఫొటోల వ్యవహారానికి సంబంధించి ఇతడ్ని రిమాండ్ కోసం పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ఉమేశ్ పాల్ కీలక సాక్షిగా ఉన్నాడు. ఇతడ్ని గతంలోనే ఓసారి కిడ్నాప్ చేసింది అతీక్ అహ్మద్ గ్యాంగ్. ఈ కేసులోనే హనీఫ్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఫిబ్రవరి 24న ఉమేశ్ పాల్‌ను అతని ఇంటి ఎదుటే అతీక్ కుమారుడు అసద్, మరికొందరు తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చారు. అనంతరం పరారయ్యారు. అయితే ఏప్రిల్ 13న అసద్‌ను ఎన్కౌంటర్లో హతమార్చారు యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఆ తర్వాత రెండు రోజులకే అతని తండ్రి అతీక్ అహ్మద్ కూడా దారుణ హత్యకు గురయ్యాడు. ప్రయాగ్ రాజ్ ఆస్పత్రికి పరీక్షల కోసం తీసుకెళ్లిన అతనిపై పోలీసులు, మీడియా ఎదుటే ముగ్గురు యువకులు తుపాకులతో కాల్పులు జరిపి హతమార్చిన ఘటన సంచలనం రేపింది. చదవండి: వాళ్లు కన్పిస్తే కాల్చి పడేయాలి.. గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌ను పొగుడుతున్నవారిపై కేంద్రమంత్రి ఫైర్.. -
కాబోయే భార్య ఫొటో షేర్ చేసిన మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇవాళ(మార్చి 3న) భూమ మౌనిక రెడ్డితో మనోజ్ ఏడడుగులు వేయబోతున్నాడు. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. ఈ నేపథ్యంలో తన పెళ్లిపై తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చాడు మంచు మనోజ్. ఈ సందర్భంగా కాబోయే భార్య ఫొటోను షేర్ చేశాడు. కొత్తపెళ్లి కూతురు అంటూ ముస్తాబైన మౌనిక ఫొటోను తన ట్విటర్లో పంచుకున్నాడు. చదవండి: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ హీరో కన్నుమూత అంతేకాదు దీనికి ‘మనోజ్ వెడ్స్ మౌనిక’ అంటూ హార్ట్ ఎమోజీని జత చేశాడు. కాగా తన సోదరి, నటి మంచు లక్ష్మి ఇంట ఈ రోజు రాత్రి 8:30 గంటలకు ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరగనుంది. ఇక మనోజ్ ట్వీట్‌పై శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ కొత్త జంటకు విషెస్ తెలుపుతున్నారు. Pellikuthuru @BhumaMounika ❤️#MWedsM #ManojWedsMounika 🙏🏼❤️ pic.twitter.com/eU6Py02jWt — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2023 -
Maternity Photoshoot: ట్రెండ్.. ప్రెగ్నెన్సీకి గ్లామర్ .. ఫొటోషూట్‌కు అదే అనువైన సమయం!
అమ్మ అవడం అనే వరాన్ని ముందస్తుగా పదిలం చేసుకోవాలనే ఆరాటం ఇటీవల సోషల్ మీడియా పోస్టుల్లో విరివిగా కనిపిస్తోంది. తమ జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నాడనే సూచనను నలుగురికి తెలియజేయాలనే తపనతో పాటు, గర్భంతో ఉన్న అందమైన ఫొటోలను సంతోషంగా షేర్ చేస్తున్నారు. వెండితెర, బుల్లితెర నటీమణులు కూడా ఈ ఆసక్తిని మరింతగా పెంచుతున్నారు. గర్భం అనేది స్త్రీకి జీవితంలో ఒక ప్రత్యేక దశ. తల్లిగా మారే ఈ ప్రయాణంలో కొన్ని కష్టాలు ఎదురైనా ఆనందాన్ని నింపుతుంది. ఇటీవల నటి కాజల్ అగర్వాల్, శ్వేతా అగర్వాల్‌ల బేబీ బంప్ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. వారిలాగే ఫొటో షూట్స్ చేసుకోవడానికి ఆసక్తి చూపేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మెటర్నిటీ ఫొటోషూట్ ఎప్పుడూ గుర్తుండిపోయేలా, ప్రత్యేకంగా ఉండాలనుకునే ట్రెండ్ జోరందుకుంది. కాలేజీ, ఉద్యోగం, పెళ్లిరోజులను ఎంజాయ్ చేయడం ఎంతగా ఇష్టపడతారో అదేవిధంగా ప్రెగ్నెన్సీని పండగలా జరుపుకోవడం నేటి రోజుల్లో అతి ముఖ్యమని ఈ ఫొటోలు చూపుతున్నాయి. ఈ ఫొటోషూట్స్ కోసం ఫొటోగ్రాఫర్లు తమ స్టూడియోలను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. విభిన్న రకాల డ్రెస్ డిజైన్లనూ గర్భవతుల కోసం రూపొందిస్తున్నారు. అనువైన సమయం ‘బేబీ బంప్ ఫొటో షూట్‌కి ఏడు–ఎనిమిది నెలల సమయం అనువైనది’ అంటున్నారు హైదరాబాద్‌లో బేబీ, ప్రెగ్నెన్సీ ఫొటోగ్రాఫర్‌గా పేరొందిన మనోజ్ఞ. ‘ఈ సమయంలో పొట్టభాగం బాగా కనిపిస్తుంది. పసిపిల్లలను ఫొటోషూట్ చేయడం కన్నా ఇది త్వరగా పూర్తవుతుంది కాబట్టి గర్భవతులకు అలసట ఏమీ ఉండదు. డ్రెస్ కలర్స్, డిజైన్స్ కోసం మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెడతాం. ఒక కలర్ థీమ్‌తో అన్ని సైజుల డ్రెస్సులను డిజైన్ చేసి ఉంచుతాను. ఇందుకు విదేశీ డిజైనర్స్‌తోనూ చర్చలు జరుపుతాను’ అంటారీమె. ఎందుకు పెరుగుతోంది అంటే.. ‘కాబోయే తల్లితండ్రులు తమ జీవితంలోకి అడుగిడబోయే కొత్త అతిథిని విభిన్న రకాలుగా ఆహ్వానించడానికి ఆసక్తి చూపుతుంటారు. కొందరు తమ చేతులపై పసిపాప మెహెందీ డిజైన్ చేయించుకొని, ఆ ఫొటోను పోస్ట్ చేస్తూ తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని పంచుకుంటారు. తమ ప్రెగ్నెన్సీ వార్తలను రకరకాలుగా షేర్ చేయడం లాగే మెటర్నిటీ ఫొటోలను కూడా పంచుకుంటున్నారు’ అంటారు ఫొటోగ్రాఫర్లు. ఇందుకు సంబంధించి తమ స్టూడియోని ప్రెగ్నెన్సీ షూట్‌కి అనువుగా మార్చుకున్నామని చెబుతున్నారు. థీమ్‌లకు పెరిగిన డిమాండ్ కాన్సెప్ట్ షూట్, బ్యాక్‌డ్రాప్ మొత్తం సాదాగా ఉండేలా, ఒంటరిగా దిగే సొలో థీమ్, బోహో థీమ్, డ్రేప్ షాట్.. వంటి థీమ్స్ ప్రస్తుతం డిమాండ్‌లో ఉన్నాయి అంటున్నారు ఫొటోషూట్స్ ఏర్పాటు చేసేవాళ్లు. ఈ ఫొటో షూట్ల సమయంలో హెయిర్ స్టైల్, మేకప్, డ్రెస్ వరకూ ప్రతి దానికీ తమ ప్రొడక్షన్ హౌజ్ నుంచే బాధ్యత తీసుకుంటున్నారు. ఫొటోషూట్ ఖర్చు కూడా ప్రొడక్షన్ హౌజ్, థీమ్, అందులో ఉపయోగించే వస్తువులపైన ఆధారపడి ఉంటుంది. అయితే, ఈ ప్రెగ్నెన్సీ ఫొటో షూట్ విషయంలో ఖర్చుకు వెనకాడటం లేదన్నది వాస్తవం. ఫ్లయింగ్ డ్రెస్ స్టైల్లో.. ప్రీ వెడ్డింగ్ షూట్ వీలుపడనివారు ఈ ప్రెగ్నెన్సీ షూట్ పట్ల మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రసవం తర్వాత కంటే గర్భంతో ఉన్నప్పుడు జంటగా ఫొటోలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. చాలావరకు బ్రైట్ కలర్స్, ఫ్లయింగ్ డ్రెస్ స్టైల్‌కి మొగ్గు చూపుతున్నారు. ప్రెగ్నెన్సీ ఫొటోషూట్‌కి 2 నుంచి 3 గంటల సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఔట్‌డోర్ అయితే గర్భిణులు త్వరగా అలసిపోయే అవకాశం ఉంది. అదే, స్టూడియోలో అయితే విశ్రాంతి తీసుకుంటూ ఫొటోషూట్ పూర్తి చేయవచ్చు. దానికి తగిన విధంగా స్టూడియో థీమ్ ఉంటుంది. శారీస్‌తోనూ ఫొటోషూట్ చేస్తాం. కానీ, సీమంతం సమయంలో తీసే ఫొటోలతో గర్భిణులు సంతృప్తిపడతారు. అందుకే చాలా వరకు వెస్ట్రన్వేర్లో కనిపించాలనుకుంటారు. లాంగ్ ఫ్లయింగ్ స్టైల్ ప్లెయిన్ గౌన్లను బాగా ఇష్టపడుతున్నారు. – మనోజ్ఞారెడ్డి, ఫొటోగ్రాఫర్ అండ్ స్టైలిస్ట్, హైదరాబాద్ -
నింగిలోకి ప్రధాని మోదీ ఫొటో
న్యూఢిల్లీ: భగవద్గీత పుస్తకం, ప్రధాని మోదీ చిత్రపటం, 25 వేల మంది పౌరుల పేర్ల జాబితాను ఈ దఫా నింగిలోకి తీసుకుపోయేందుకు ఇస్రో సిద్ధమైంది. ఇస్రో 50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. వీటిలోని ఒక శాటిలైట్‌లో మోదీ ఫొటో, భగవద్గీత కాపీ, పౌరుల పేర్లను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఫిబ్రవరి 28న పీఎస్ఎల్వీ సీ–51 ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజోనియా–1, భారత ప్రైవేటు సంస్థలు రూపొందించిన ఆనంద్, సతీశ్ ధావన్, యునిటీశాట్ ఉపగ్రహాలతో పాటు మొత్తం 21 శాటిలైట్లను ప్రయోగించనుంది. వీటిలో ఆనంద్‌ను బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ పిక్సెల్, సతీశ్ ధావన్(ఎస్డీ శాట్)ను చెన్నైకు చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా, యునిటీశాట్‌ను జిట్‌శాట్ (శ్రీపెరంబుదూర్), జీహెచ్‌ఆర్‌సీఈ శాట్(నాగ్‌పుర్), శ్రీశక్తి శాట్ (కోయంబత్తూరు) కళాశాలల విద్యార్థులు రూపొందించారు. వీటిలో సతీష్‌ధావన్ శాటిలైట్‌లో మోదీ పేరు, ఫొటో, ‘ఆత్మనిర్భర్ మిషన్’∙పదాలు, భగవద్గీత కాపీ, 25000 మంది పౌరుల పేర్ల జాబితాను తీసుకెళ్లనున్నట్లు స్పేస్ కిడ్జ్ సీఈవో డాక్టర్ శ్రీమతి కేసన్ తెలిపారు. అంతరిక్షంలోకి పేర్లను పంపేందుకు అడిగిన వారం రోజుల్లోనే 25వేల ఎంట్రీలు వచ్చాయి. వీటిలో 1000 పేర్లు విదేశీయులవి ఉన్నాయన్నారు. వీరందరికీ బోర్డింగ్ పాస్‌లు ఇచ్చామన్నారు. ప్యానెల్ దిగువన ఇరువైపులా ఇస్రో చైర్మన్ శివన్, సైంటిఫిక్ సెక్రటరీ ఉమామహేశ్వరన్ పేర్లను చెక్కినట్లు తెలిపారు. విదేశాలకు చెందిన కొన్ని ప్రయోగాల్లో ఆయా దేశాలు బైబిల్‌ను అంతరిక్షంలోకి పంపాయి. ఇదే తరహాలో హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతను అంతరిక్షంలోకి పంపించాలనుకుంటున్నామని డాక్టర్ శ్రీమతి వెల్లడించారు. పీఎస్ఎల్వీ సీ–51 వాహకనౌకను శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఫిబ్రవరి 28న ఉదయం 10.24 గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. -
ఆఖరిది ఆరంభం
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మంచి జోరు మీదున్నారు. కరోనా లాక్డౌన్ వల్ల కొన్ని నెలల పాటు షూటింగ్‌కి దూరంగా ఉన్న సల్మాన్ ఇప్పుడు స్పీడు పెంచారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ‘రాధే’ సినిమా చిత్రీకరణ పూర్తి చేసిన ఆయన వెంటనే ‘అంతిమ్’ (ఆఖరిది) సినిమా షూట్లో జాయిన్ అయిపోయారు. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ సిక్కు పోలీసాధికారిగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని సల్మాన్ ఖాన్ లుక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ‘అంతిమ్’ సెట్స్‌లో తీసిన ఒక వీడియోను సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ భర్త ఆయుష్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సిక్కుల తలపాగా ధరించి, ఫార్మల్ డ్రెస్‌లో కూరగాయల మార్కెట్ సెట్లో నడుస్తున్న కండల వీరుడి లుక్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
ఎప్పటికీ ఆనందంగా...
భర్త ప్రసన్న పుట్టినరోజు సందర్భంగా తమ కుమార్తె ఆద్యంత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు స్నేహ. 2012లో తమిళ నటుడు ప్రసన్న, హీరోయిన్ స్నేహ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2015లో స్నేహ ఓ బాబుకి జన్మనిచ్చారు. బాబు పేరు విహాన్. ఈ ఏడాది జనవరిలో పాపకు జన్మనిచ్చారు స్నేహ. శుక్రవారం ప్రసన్న పుట్టినరోజుని పురస్కరించుకుని పాప ఆద్యంత ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు స్నేహ. అలాగే ‘‘నా సోల్‌మేట్ (ప్రసన్నని ఉద్దేశించి)కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా జీవితాన్ని ఆనందమయం చేసిన నా లవర్ బాయ్, నా గార్డియన్ ఏంజిల్ తను. మేం ఆనందంగా ఉండాలని దీవిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మా జీవితం ఎప్పటికీ ఇలా ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు స్నేహ. -
బుట్టబొమ్మ సారీ చెప్తుందా?
టాలీవుడ్ ప్రముఖ కథానాయుకలు సమంత అక్కినేని, పూజా హెగ్డే ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వివాదం మరింత ముదిరింది. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని గురువారం పూజా ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని గంటల పాటు తన టెక్నికల్ టీం సాయంతో ఖాతాను తిరిగి పునరుద్దరించినట్లు తెలిపారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఖాతా హ్యాక్ అయిన సందర్భంలో పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో.. మజిలీ సినిమాలోని సమంత ఫోటోను జత చేస్తూ ఈమె (సమంత )నాకు పెద్దగా అందంగా కనిపించదు అంటూ కామెంట్ చేశారు హ్యాకర్స్ . ఇది సమంత అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. (సమంతకు సారీ చెప్పాలి ) Spent the last hour stressing about the safety of my Instagram account. Thanking my technical team for instant help at this hour. Finally, got my hands back on my Instagram 🥰 Any message, follow back or post in d past hour from my account has been done will be undone. Ty. — Pooja Hegde (@hegdepooja) May 27, 2020 అకౌంట్ హ్యాక్ అయ్యిందని పూజా వివరణ ఇచ్చినా ఫ్యాన్స్ అవేం పట్టించుకోలేదు. వెంటనే సమంతకు సారీ చెప్పాలంటూ పెద్ద ఎత్తున ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. దీనికి తోడు డైరెక్టర్ నందినీ రెడ్డి, గాయని చిన్మయి శ్రీపాద..పూజా హెగ్డేను ఉద్దేశించి వ్యంగాస్ర్తాలు సందించారు. నా బ్రెయిన్ కూడా హ్యాక్ అయ్యింది అంటూ నందనీ కామెంట్ పెడితే, ప్లీజ్ లవ్ మీ టూ.. నా అకౌంట్ హ్యాక్ అవ్వలేదు అంటూ చిన్మయి వరుస కామెంట్లు పెడుతూ సమంతకు అండగా నిలిచారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను వైరల్ చేస్తూ.. ఫెమినిస్ట్ అని చెప్పుకునే తిరిగే చిన్మయి ఇంకో అమ్మాయిపై ఎలా నిందలు వేయగలుగుతుంది అంటూ పూజా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు నిజాలు తెలుసుకోకుండా ఇలా చీప్ కామెంట్లు పెడతారా అంటూ నందనీరెడ్డిపై కూడా ఫైర్ అయ్యారు. దీంతో వివాదం మరింత ముదిరి అటు సమంత ఫ్యాన్స్, ఇటు బుట్టబొమ్మ ఫ్యాన్స్ వరుస ఆరోపణలు చేస్తూ ట్విట్టర్లో రచ్చ రచ్చ చేస్తున్నారు. 'వి సపోర్ట్ పూజా హెగ్డే' అంటూ ఆమె అభిమానులు వరుస ట్వీట్లు చేస్తున్నారు. Without knowing the real reason,how could u guys form a group and pass sarcasm on one.Ok...now what this doesn't come under ur so called "feminism" #WeSupportPoojaHegde pic.twitter.com/J4uh7nmQBw — Harshi✨ (@hd_2207) May 28, 2020 -
సమంతకు సారీ చెప్పాలి
ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండటానికి, తమ గురించి అప్డేట్స్ ఇవ్వడానికి స్టార్స్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇందులో ఎంత ప్లస్సుందో కొంత మైనస్సు కూడా ఉంది. స్టార్స్ సోషల్ మీడియా అకౌంట్స్‌ను హ్యాక్ చేసి వాళ్లను ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టేస్తుంటారు హ్యాకర్స్. తాజాగా పూజా హెగ్డేకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకయింది. ‘మజిలీ’ సినిమాలోని సమంత ఫొటోను షేర్ చేసి – ‘‘నాకెందుకో ఆమె (సమంత) అంత అందంగా అనిపించదు’’ అని పూజా ఇన్‌స్టాలో క్యాప్షన్ చేశారు హ్యాకర్స్. వెంటనే పూజా అప్రమత్తయ్యారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని తెలిపారామె. ‘‘నా టెక్నికల్ టీమ్ సహకారంతో అకౌంట్‌ను మళ్లీ మా చేతుల్లోకి తీసుకున్నాం. హ్యాక్ అయిన సమయంలో నా అకౌంట్ నుంచి ఏదైనా పోస్ట్ అయ్యుంటే పెద్దగా పట్టించుకోకండి’’ అన్నారు పూజా. ఇదిలా ఉంటే.. పూజా హెగ్డే అకౌంట్లో సమంత గురించి ఇలా పోస్ట్ అవ్వడంతో సోషల్ మీడియాలో సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమంతకు పూజా హెగ్డే క్షమాపణలు చెప్పాలని ట్వీటర్లో ట్రెండ్ చేశారు సమంత ఫ్యాన్స్. -
ఇదే.. నాకు సంతోషాన్నిచ్చేది: మిహీకా బజాజ్
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కాబోయే భార్య మిహీకా బజాజ్‌ల రోకా కార్యక్రమం ఫొటోలు ప్రస్తుతం నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రానాతో సన్నిహతంగా ఉన్న పలు ఫొటోలను మిహీకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో గురువారం షేర్ చేశారు. ఇందులో రానా తన చెవిలో గుసగుసలాడుతున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఇదే నాకు సంతోషాన్నిచ్చేది’ అంటూ 3 హార్ట్ ఎమోజీలతో నవ్వుతూ ఉండే రెండు ఎమోజీలను జత చేసి షేర్ చేశారు. ఇక మిహీకా పోస్టుకు హీరో వెంకటేష్ కూతురు అశ్రిత దగ్గుబాటి ‘‘పట్టలేనంత సంతోషంగా ఉంది. నేను అక్కడ లేనన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా, మీ ఇద్దరికి నా పెద్ద హగ్’’ అంటూ కామెంట్ చేశారు. అంతేగాక బాలీవుడ్ బామ సోనమ్ కపూర్ భర్త అనంద్ అహుజీ కూడా మిహీక-రానాలకు శుభకాంక్షలు తెలిపాడు. (నిశ్చితార్థంపై క్లారిటీ ఇచ్చిన రానా) చదవండి: నా భర్త ఎక్కడో గొయ్యి తవ్వుతున్నాడు : సమంత View this post on Instagram My happy place! 🥰🥰 @ranadaggubati A post shared by miheeka (@miheeka) on May 21, 2020 at 12:03am PDT రానాతో ఉన్న మరో ఫొటోను షేర్ చేస్తూ, ‘ఇది ఆరంభం...ఇక ఎప్పటికీ’ అనే క్యాప్షన్‌కు హార్ట్ ఎమోజీలను జత చేయగా, గతవారం మిహీకా తన ప్రేమను అంగికరించిందని ఇప్పుడు తామిద్దరం రిలేషన్షిప్లో ఉన్నామంటూ రానా తన ప్రేమను సోషల్ మీడియాలో అధికారింగా ప్రకటించిన విషయం తెలిసిందే. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు కూడా గ్రీన్ సిగ్నిల్ ఇవ్వడంతో మంగళవారం వీరిద్దరి నిశ్చితార్థం, వివాహా వేడులకు ముహుర్తం ఖారారు చేసేందుకు బుధవారం రామనాయుడు స్టూడియోలో రోకా కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో వీరిద్దరికి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల ప్రముఖుల నుంచి సోషల్ మీడియాలో శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. (నిశ్చితార్థం కాదు.. రోకా) -
నిశ్చితార్థం కాదు.. రోకా
ప్రేయసి మిహికాతో కలసి దిగిన కలర్‌ఫుల్ ఫొటోలను గురువారం షేర్ చేశారు రానా. ఆ ఫొటోలు చూసినవాళ్లు నిశ్చితార్థం జరిగిందని ఊహించుకున్నారు. కానీ, జరిగినది ‘రోకా ఫంక్షన్’. అంటే.. ఇరు కుటుంబ సభ్యులు కలుసుకుని పెళ్లి విశేషాలు మాట్లాడుకుంటారు. స్వీట్లు, గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకుంటారు. ఉత్తరాదిన (పంజాబీలో ముఖ్యంగా) ఈ కార్యక్రమం జరుపుకుంటారు. ఈ రోకా వేడుక సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు రానా. డిసెంబర్లో రానా–మిహికా బజాజ్‌ల వివాహం జరగనుందని సమాచారం. -
కాబోయే తల్లికి శుభాకాంక్షలు!
తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్, నయనతార కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈ విషయాన్ని ఈ ఇద్దరూ ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు. సోషల్ మీడియాలో పోస్ట్‌ల ద్వారా, కలసి చేసే ప్రయాణాల ద్వారా ఎప్పటికప్పుడు తమ ప్రేమను చెప్పకనే చెబుతున్నారు. ఆ మధ్య ఓ ఆడియో ఫంక్షన్ లో విఘ్నేష్ శివన్‌ని నయనతార హబ్బీ (భర్త) అని సంబోధించారు. తాజాగా మదర్స్ డే సందర్భంగా విఘ్నేష్ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నయనతార చిన్న పిల్లాడిని ఎత్తుకున్న ఫొటో అది. దానికి ఈ విధంగా క్యాప్షన్ చేశారు. ‘‘భవిష్యత్తులో నా పిల్లలకు తల్లి కాబోయే తనకి (నయనతారని ఉద్దేశిస్తూ) మదర్స్ డే శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు విఘ్నేష్. ఈ ఏడాది చివర్లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలకు ఈ కామెంట్ మరింత బలాన్ని చేకూర్చింది. విఘ్నేష్ శివన్, నయనతార -
కూతురి కోసం...
షూటింగ్స్ ఆగిపోవడంతో ఇంటిపట్టున ఉంటున్న సినిమా స్టార్స్ తమకు నచ్చినట్లుగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ అయితే తన కూతురి కోసం సరదాగా పోనీ టెయిల్ వేసుకున్నారు. ‘‘నా కూతురు (నుర్వీ) పోనీ టెయిల్ వేసుకోనంటే వేసుకోనని ఒకటే మారాం చేసింది. తనని ఒప్పించడానికి నేను పోనీ టెయిల్ వేసుకున్నాను’’ అంటూ ఇక్కడున్న ఫొటోను షేర్ చేశారు నీల్ నితిన్. ప్రభాస్ ‘సాహో’, బెల్లకొండ సాయి శ్రీనివాస్ ‘కవచం’ చిత్రాల్లో నీల్ నితిన్ కీలక పాత్రల్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
వివేకం కోల్పోయావా వివేక్?
ముంబై: సోషల్ మీడియా వేదికగా ఏదైనా పోస్ట్ షేర్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే దేశం యావత్తు ఉలిక్కిపడేలా ప్రకంపనలు రేగుతాయి. ఇలాంటి ట్విట్టర్ దుమారమే మరోసారి చోటుచేసుకుంది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్, ఐశ్వర్యరాయ్‌ను కించపరిచేలా ఉన్న ఒక మీమ్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. దీనిలో సల్మాన్‌తో ఐశ్వర్య ఉన్న ఫొటోకు ఒపీనియన్ పోల్, వివేక్–ఐశ్వర్య చిత్రానికి ఎగ్జిట్ పోల్, అభిషేక్, ఆరాధ్య, ఐశ్వర్య కలిసి ఉన్న చిత్రానికి రిజల్ట్ అని టైటిల్ ఇచ్చి, ఈ మూడు చిత్రాలతో కూడిన మీమ్‌ను రూపొందించారు. ‘హ..హ.. క్రియేటివ్, రాజకీయాల్లేవు, కేవలం జీవితం’ అని టైటిల్‌తో దీనిని వివేక్ ట్విట్టర్లో షేర్ చేశారు. కొద్ది వ్యవధిలోనే ఈ పోస్ట్ వైరల్‌గా మారి నెటిజన్లను మండిపాటుకు గురిచేసింది. అతని స్థాయిని సూచిస్తోంది ఈ ట్వీట్ అసహ్యంగా ఉందంటూ నటి సోనమ్ కపూర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా, పలువురు మహిళా జర్నలిస్టులు, ప్రముఖులు ట్విట్టర్లో స్పందించారు. వివేక్‌కు నోటీసులు పంపుతామన్నారు మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్. అతని నీచ బుద్ధిని.. అతను జీవితంలోను, రాజకీయాల్లోను సమర్థుడు కాదని తేల్చడానికి ఇదే సాక్ష్యం అంటూ ట్వీట్ చేశారు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్. -
ఫేస్బుక్లో మొసలి ఫొటో హల్చల్!
చూశారా దీన్ని.. ముగ్గురు మనుషులు.. ఒకరిపై ఒకరు నిల్చున్నా.. వారినీ ఈ మొసలి దాటిపోయింది.. ప్రస్తుతం ఫేస్బుక్లో ఈ మొసలి ఫొటో హల్చల్ చేస్తోంది. దీన్ని బ్రిటన్‌కు చెందిన క్లేటన్ సాడన్ అనే మహిళ పోస్ట్ చేసింది. జనం సరదాగా చేపలు పట్టడానికి వెళ్లే ఓ సరస్సు వద్ద దీన్ని పట్టుకున్నట్లు తెలిపింది. ఆమె ఈ ఫొటో పెట్టింది మొదలు.. ఇది బ్రిటన్‌లోని ఏ ప్రాంతంలో తీసింది అనే చర్చ మొదలైంది. అయితే, సాడన్ బ్రిటన్‌లో నివాసమున్నప్పటికీ.. ఆమె జింబాబ్వేకు చెందిన మహిళ అయినందున ఈ ఫొటో అక్కడ తీసి ఉంటారని కొందరు.. ఆస్ట్రేలియాలో పట్టి ఉండి ఉంటారని మరికొందరు అంటున్నారు. అయితే ఎక్కడ తీసిందీ చిత్రం అన్న విషయాన్ని క్లేటనే స్వయంగా తెలిపే వరకూ ఈ చర్చకు ఫుల్స్టాప్ పడే అవకాశం కనిపించడంలేదు.