Manchu Manoj Shared His Fiancee Bhuma Mounika Reddy Photo On Twitter - Sakshi
Sakshi News home page

Manchu Manoj: కాబోయే భార్య ఫొటో షేర్‌ చేసిన మంచు మనోజ్‌

Published Fri, Mar 3 2023 10:34 AM | Last Updated on Fri, Mar 3 2023 11:02 AM

Manchu Manoj Shared New Bride, Fiancee Bhuma Mounika Reddy Photo - Sakshi

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ రెండో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇవాళ(మార్చి 3న) భూమ మౌనిక రెడ్డితో మనోజ్‌ ఏడడుగులు వేయబోతున్నాడు. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. ఈ నేపథ్యంలో తన పెళ్లిపై తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చాడు మంచు మనోజ్‌. ఈ సందర్భంగా కాబోయే భార్య ఫొటోను షేర్‌ చేశాడు. కొత్తపెళ్లి కూతురు అంటూ ముస్తాబైన మౌనిక ఫొటోను తన ట్విటర్‌లో పంచుకున్నాడు.

చదవండి: సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ హీరో కన్నుమూత

అంతేకాదు దీనికి ‘మనోజ్‌ వెడ్స్‌ మౌనిక’ అంటూ హార్ట్‌ ఎమోజీని జత చేశాడు. కాగా తన సోదరి, నటి మంచు లక్ష్మి ఇంట ఈ రోజు రాత్రి 8:30 గంటలకు ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరగనుంది. ఇక మనోజ్‌ ట్వీట్‌పై శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఈ కొత్త జంటకు విషెస్‌ తెలుపుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement