ఫేస్‌బుక్‌లో మొసలి ఫొటో హల్‌చల్! | crocodile photo viral share on facebook | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో మొసలి ఫొటో హల్‌చల్!

Published Thu, Jun 23 2016 4:08 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఫేస్‌బుక్‌లో మొసలి ఫొటో హల్‌చల్! - Sakshi

ఫేస్‌బుక్‌లో మొసలి ఫొటో హల్‌చల్!

చూశారా దీన్ని.. ముగ్గురు మనుషులు.. ఒకరిపై ఒకరు నిల్చున్నా.. వారినీ ఈ మొసలి దాటిపోయింది.. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో ఈ మొసలి ఫొటో హల్‌చల్ చేస్తోంది. దీన్ని బ్రిటన్‌కు చెందిన క్లేటన్ సాడన్ అనే మహిళ పోస్ట్ చేసింది. జనం సరదాగా చేపలు పట్టడానికి వెళ్లే ఓ సరస్సు వద్ద దీన్ని పట్టుకున్నట్లు తెలిపింది. ఆమె ఈ ఫొటో పెట్టింది మొదలు.. ఇది బ్రిటన్‌లోని ఏ ప్రాంతంలో తీసింది అనే చర్చ మొదలైంది. అయితే, సాడన్ బ్రిటన్‌లో నివాసమున్నప్పటికీ.. ఆమె జింబాబ్వేకు చెందిన మహిళ అయినందున ఈ ఫొటో అక్కడ తీసి ఉంటారని కొందరు.. ఆస్ట్రేలియాలో పట్టి ఉండి ఉంటారని మరికొందరు అంటున్నారు. అయితే ఎక్కడ తీసిందీ చిత్రం అన్న విషయాన్ని క్లేటనే స్వయంగా తెలిపే వరకూ ఈ చర్చకు ఫుల్‌స్టాప్ పడే అవకాశం కనిపించడంలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement