
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మంచి జోరు మీదున్నారు. కరోనా లాక్‌డౌన్ వల్ల కొన్ని నెలల పాటు షూటింగ్‌కి దూరంగా ఉన్న సల్మాన్ ఇప్పుడు స్పీడు పెంచారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ‘రాధే’ సినిమా చిత్రీకరణ పూర్తి చేసిన ఆయన వెంటనే ‘అంతిమ్’ (ఆఖరిది) సినిమా షూట్‌లో జాయిన్ అయిపోయారు. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ సిక్కు పోలీసాధికారిగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని సల్మాన్ ఖాన్ లుక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ‘అంతిమ్’ సెట్స్‌లో తీసిన ఒక వీడియోను సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ భర్త ఆయుష్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సిక్కుల తలపాగా ధరించి, ఫార్మల్ డ్రెస్‌లో కూరగాయల మార్కెట్ సెట్లో నడుస్తున్న కండల వీరుడి లుక్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment