
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో సాహో టీం ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్‌లోనూ భారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సినిమా మీద అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఆ అంచనాలు అందుకునే స్థాయిలో సినిమా ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.
ప్రధాన పాత్రదారులు వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తాజాగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన నీల్ నితిన్ ముఖేష్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘దర్శకుడు సుజీత్ ఈ సినిమా కథ బాహుబలి తొలి భాగం రిలీజ్ సమయంలోనే నాడు వినిపించాడు. కథ నచ్చటంతో వెంటనే ఓకె కూడా చెప్పాను.
కానీ ప్రభాస్.. బాహుబలి 2తో బిజీగా ఉండటంతో ప్రాజెక్ట్ ఆలస్యమైంది. నేను కూడా ఇతర సినిమాలు చేశాను. ఒక దశలో నన్ను సాహో నుంచి తీసేశారేమో అనుకున్నా. కానీ సుజీత్ ఇచ్చిన మాట ప్రకారం నన్ను కీలక పాత్ర కోసం మళ్లీ పిలిచారు’ అని వెల్లడించారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్‌లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘సాహో’ను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈసినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment