
బాహుబలితో జాతీయ స్టార్‌గా మారిపోయిన ప్రభాస్‌పై ప్రశంసల పరంపర కొనసాగుతూనే ఉంది.
ముంబై: బాహుబలితో జాతీయ స్టార్‌గా మారిపోయిన ప్రభాస్‌పై ప్రశంసల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రభాస్ కొత్త చిత్రం సాహోలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్.. ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ నిజంగా డార్లింగ్ అని.. తనతో పని చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.
పనిలో పనిగా హీరోయిన్ శ్రద్ధా కపూర్‌పై ప్రశంసించారు. త్వరలోనే సెట్స్‌లో మీతో చేరనున్నందకు సంతోషంగా ఉందని నీల్ నితిన్ ట్వీట్ చేశాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న సాహోలో వీరితో పాటు జాకీష్రాఫ్, మందిరా బేడి, అరుణ్ విజయ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్నితెలుగుతో పాటు తమిళం, హిందీలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
#Prabhas is truly a Darling and @ShraddhaKapoor you are amazing. Looking forward to seeing you soon on the sets. God Bless.
— Neil Nitin Mukesh (@NeilNMukesh) October 6, 2017