అంతం అన్నింటికీ సమాధానం కాదు | Neil Nitin Mukesh And Arun Vijay First Look From Saaho Movie | Sakshi
Sakshi News home page

అంతం అన్నింటికీ సమాధానం కాదు

Published Tue, Aug 6 2019 6:59 PM | Last Updated on Tue, Aug 6 2019 6:59 PM

Neil Nitin Mukesh And Arun Vijay First Look From Saaho Movie - Sakshi

ఇండియన్‌ తెరపై ఇంతవరకెన్నడూ చూడని యాక్షన్‌ సీన్స్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. బాహుబలి లాంటి సినిమాల తరువాత ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం కావడంతో  భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా రిలీజ్‌ టైమ్‌ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్‌ కార్యక్రమాలను పెంచేసింది చిత్రబృందం. ఇప్పటికే రిలీజ్‌ చేసిన టీజర్స్‌, సాంగ్స్‌తో భారీ అంచనాలను పెంచేసిన సాహో.. రోజురోజుకూ హైప్‌ పెంచేస్తోంది.

ఈ చిత్రంలో ముఖ్యపాత్రలను పోషించిన వారి పోస్టర్‌లను రిలీజ్‌ చేస్తోంది యూనిట్‌. అంతం అన్నింటికీ సమాధానం కాదు అంటూ నీల్‌ నితీష్‌ ముఖేష్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. తాజాగా.. బ్లడ్‌కు బ్లడీ ఇన్విటేషన్‌ అవసరం లేదంటూ అరుణ్‌ విజయ్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ డైలాగ్‌లను చూస్తుంటే వీరి క్యారెక్టర్స్‌ ఏరేంజ్‌లో ఉండబోతున్నాయో అర్థమవుతోంది. యూవీ క్రియేషన్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఆగస్ట్‌ 30న విడుదల కానుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement