‘సాహో’.. తాజా అప్‌డేట్‌ | Prabhas Saaho Shooting Update | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 27 2018 12:21 PM | Last Updated on Tue, Feb 27 2018 12:30 PM

Prabhas in Saaho - Sakshi

‘సాహో’ సినిమాలో ప్రభాస్‌

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌.. ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రభాస్‌ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో యువి క్రియేషన్స్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సుజిత్‌(రన్‌ రాజా రన్‌ ఫేం) దర్శకుడు. భారీ యాక్షన్‌ సీన్స్‌ షూట్‌ కోసం చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేస్తుండగా కొద్ది రోజులుగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.

దుబాయ్‌లో అత్యంత భారీ వ్యయంతో సాహో యాక్షన్‌ సీన్స్‌ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్‌లో ఫైట్స్ తో పాటు చేజ్‌ సీన్స్‌ కూడా చిత్రీకరించాలని భావించారు. అయితే అనుమతుల విషయంలో ఆలస్యం జరగటంతో ఈషెడ్యూల్‌ ను వాయిదా వేశారన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో దుబాయ్‌ తరహా సెట్‌ను రూపొందించిన రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేసే అవకాశాలను కూడా చిత్రయూనిట్ పరిశీలించారట.

అయితే తాజా సమాచారం ప్రకారం మార్చి మూడో వారం నుంచి దుబాష్ షెడ్యూల్‌ షూటింగ్ మొదలు కానుందట. అనుమతుల విషయంలో క్లారిటీ రావటంతో ఇప్పటికే కొంత మంది యూనిట్‌ సభ్యులు దుబాయ్‌ చేరుకొని ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేశారు. ఈ షెడ్యూల్‌లో దుబాయ్‌, అబుదాబి, రొమేనియాల్లో 60 రోజుల పాటు షూటింగ్‌ చేయనున్నారు.  ప్రభాస్‌ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఉత్తరాది నటులు నీల్ నితన్‌ ముఖేష్‌, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, మందిరా బేడిలు కీలక పాత్రలో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement