‘సాహో’ ట్రైలర్‌ వచ్చేసింది | Prabhas Saaho Trailer Is Released | Sakshi
Sakshi News home page

గల్లీల్లో సిక్స్‌ ఎవడైనా కొడతాడు : ప్రభాస్‌

Published Sat, Aug 10 2019 5:09 PM | Last Updated on Sat, Aug 10 2019 7:50 PM

Prabhas Saaho Trailer Is Released - Sakshi

దేశవ్యాప్తంగా హీట్‌ పెంచేస్తున్న సినిమా సాహో. బాహుబలితో జాతియ స్థాయిలో క్రేజ్‌ను సొం‍తం చేసుకున్న ప్రభాస్‌.. సాహోతో రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యాడు. ఇదివరకెన్నడూ చూడని యాక్షన్‌ సీన్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే టీజర్స్‌, సాంగ్స్‌తో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్న సాహో.. యూట్యూబ్‌ను షేక్‌చేసేందుకు సిద్దమైంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.

రెండు వేల కోట్ల రాబరీ.. దాన్ని చేజ్‌ చేసేందుకు పోలీసులు.. చేజిక్కించుకునేందుకు అండర్‌ వరల్డ్‌ డాన్స్‌.. ఇది వరకు చూడని పోరాట సన్నివేశాలను మన ముందుకు తీసుకొస్తుంది సాహో. ఈ రెండు నిమిషాల 46 సెకన్లలోనే ఈ రేంజ్‌లో చూపించాము.. ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో ఊహించుకోండి అనేట్టుగా ట్రైలర్‌ను కట్‌చేశారు. అశోక్‌ చక్రవర్తి అనే క్యారెక్టర్‌లో ప్రభాస్‌.. క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో అమృతా నాయర్‌గా శ్రద్దా నటిస్తోంది. ఈ సినిమాలో యాక్షన్‌, రొమాన్స్‌, కామెడీ ఇలా అన్నీ ఉన్నాయని తెలిసేట్టుగా ట్రైలర్‌ను డిజైన్‌ చేసి రిలీజ్‌ చేశారు. జాకీ ష్రాఫ్, అరుణ్‌ విజయ్, మురళీ శర్మ, మందిరా బేడీ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement