sujeeth
-
సాహో డైరెక్టర్‌తో పవన్ కల్యాణ్ నెక్ట్స్ మూవీ.. పోస్టర్ రిలీజ్
పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఆయన నెక్ట్స్ సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన డీవీవీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లో పవన్ హీరోగా ఓ సినిమాను ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రన్రాజారన్తో దర్శకుడిగా మారిన సుజీత్ ప్రభాస్‌తో సాహో వంటి పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ యంగ్ డైరెక్టర్ పవన్‌తో సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. మొత్తం ఎరుపు రంగుతో డిజైన్ చేసిన పోస్టర్లో జపనీస్ అక్షరాలు కూడా ఉన్నాయి. జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే గ్యాంగ్‌స్టర్ డ్రామా అని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌మీదకి వెళ్లనుంది. We are extremely elated to associate with @PawanKalyan Garu, for our next production.⚡️⭐️ Directed by @SujeethSign, DOP by @DOP007.#FirestormIsComing 🔥🔥 pic.twitter.com/Dd91Ik8sTK — DVV Entertainment (@DVVMovies) December 4, 2022 -
ప్రేయసిని పెళ్లాడిన 'సాహో' డైరెక్టర్
సాక్షి, హైదరాబాద్ : సాహో’ చిత్ర దర్శకుడు సుజీత్ ప్రేయసిని ఆగస్టు 2న పెళ్లాడాడు. పంచభూతాల సాక్షిగా డెంటిస్ట్ ప్రవళికతో ఏడడుగులు వేశాడు. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ యంగ్ డైరెక్టర్ పెద్దల అంగీకారంతో ఇష్టసఖిని మనువాడాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు రిసార్టులో జరిగిన ఈ పెళ్లి వేడుకకు అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. 29 ఏళ్ల యంగ్ డైరెక్టర్ సుజీత్ సాంప్రదాయ ధోతి, కుర్తా ధరించగా, వధువు ప్రవళిక గులాబీ రంగు చీరలో మెరిసిపోయింది. హిందూ సాంప్రదాయం ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ పెళ్లి వేడుక జరిగింది. వివాహానికి హాజరైన బంధువులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇటీవల హీరో నితిన్, నిఖిల్, కమెడియన్ మహేష్, నిర్మాత దిల్ రాజు ఇలా చిత్రపరిశ్రమకు చెందిన ఒక్కొక్కరు పెళ్లిపీటలు ఎక్కిన విషయం తెలిసిందే. (నితిన్ సినిమాకు నో చెప్పిన బుట్టబొమ్మ!) డైరెక్టర్ సుజీత్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జూన్ 10న హైదరాబాదులో సుజీత్ -ప్రవళికల నిశ్చితార్థం జరిగింది. 'రన్ రాజా రన్' సినిమాతో దర్శకుడిగా వెండితెరపై అడుగుపెట్టిన సుజీత్‌కు ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో ఏకంగా ప్రభాస్‌తో కలిసి పని చేసే ఛాన్స్ కొట్టేశాడు. హాలీవుడ్ అంతటి రేంజ్లో 'సాహో' చిత్రాన్ని తెరకెక్కించి విశేష గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం సుజీత్ 'లూసిఫర్' రీమేక్ తెరకెక్కించనుండగా ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నారని సమాచారం. ఇంకా స్క్రిప్ట్‌ను మెరుగులు దిద్దుతూ ఉన్నందున ఈ ఏడాది చివరికి ఆ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది. (వర్మ నోట ‘మర్డర్’పాట.. విడుదల) @sujeethsign Happy Married Life Sujeeth Bro Wishing All Success , Good Health , and Happiness 🖤 pic.twitter.com/2tdaPLxRQq — P.GIREESH REDDY (@GReddyPetluru) July 28, 2020 -
'సాహో' దర్శకుడి నిశ్చితార్థం
ఓ రకంగా లాక్డౌన్ సెలబ్రిటీలకు బాగానే కలిసొచ్చినట్టుంది. కరోనా కాలంలోనే నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్, కమెడియన్ మహేశ్ ఇప్పటికే పెళ్లి బాజాలు మోగించగా రానా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. ఇప్పుడీ జాబితాలోకి 'సాహో' దర్శకుడు సుజీత్ రెడ్డి కూడా ఎంటరయ్యాడు. ఈ యువ దర్శకుడు తను ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేయనున్నాడు. ఈ మేరకు బుధవారం(జూన్ 10) హైదరాబాద్‌కు చెందిన డెంటిస్ట్ ప్రవళికతో ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. ఇరు కుటుంబ సభ్యుల మధ్య సింపుల్‌గా ఈ కార్యక్రమం జరగ్గా త్వరలోనే పెళ్లి ముహూర్తం పెట్టుకోనున్నారు. (డెంటిస్ట్‌తో ప్రేమ.. జూన్ 10న నిశ్చితార్థం?) ప్రస్తుతం అతడి నిశ్చితార్థ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా 23 ఏళ్ల వయసులోనే సుజీత్ 'రన్ రాజా రన్' సినిమాతో దర్శకుడిగా వెండితెరపై తన అదష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో ఏకంగా ప్రభాస్‌తో కలిసి పని చేసే ఛాన్స్ కొట్టేశాడు. హాలీవుడ్ అంతటి రేంజ్లో 'సాహో' చిత్రాన్ని తెరకెక్కించి విశేష గుర్తింపు సాధించాడు. ప్రస్తుతం సుజీత్ 'లూసిఫర్' రీమేక్ తెరకెక్కించనుండగా ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నాడు. ఇంకా స్క్రిప్ట్‌ను మెరుగులు దిద్దుతూ ఉన్నందున ఈ ఏడాది చివరికి ఆ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది. (శింబు పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రాజేందర్) -
డెంటిస్ట్‌తో ప్రేమ.. జూన్ 10న నిశ్చితార్థం?
హైదరాబాద్: ‘సాహో’ చిత్ర దర్శకుడు సుజీత్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవలే నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్, కమెడియన్ మహేష్ వరుసగా ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. ఇదే జాబితాలో సుజిత్ కూడా త్వరలో చేరనున్నారు. ప్రవళిక అనే డెంటిస్ట్‌తో గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ యంగ్ డైరెక్టర్ పెద్దల అంగీకారంతో త్వరలోనే ఆమె మెడలో మూడు ముళ్లు వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్ 10న హైదరాబాద్‌లో సుజీత్-ప్రవళికల నిశ్చితార్థం ఉండనున్నట్లు సమాచారం. (హ్యాపీ బర్త్‌డే ‘కామ్రేడ్ భారతక్క’) లాక్డౌన్ కారణంగా ఎంగేజ్మెంట్ చాలా సింపుల్‌గా జరగనుందని, ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలిసింది. నిశ్చితార్థం రోజునే పెళ్లి తేదీపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉందని టాలీవుడ్ టాక్. అయితే ఈ వార్తలపై సుజీత్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇక రన్రాజాతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన సుజీత్ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో హాలీవుడ్ రేంజ్లో తీసిన ‘సాహో’ చ్రితంతో ఫుల్ ఫేమ్‌తో పాటు క్రేజ్ సాధించాడు. దీంతో తన మూడో చిత్రం మెగాస్టార్‌తో తీసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ‘లూసిఫర్’ రీమేక్‌ను తెలుగులో ఈ యువ దర్శకుడే డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. (మహేశ్‌తో మరో సినిమా?) -
సాహో డైరెక్టర్‌కి ‘మెగా’ ఆఫర్
శర్వానంద్ హీరోగా వచ్చిన రన్ రాజా రన్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సుజీత్.. తన రెండో చిత్రాన్నే స్టార్ హీరో ప్రభాస్ తో చేసే ఛాన్స్ కొట్టేశాడు. పాన్ ఇండియా మూవీగా ప్రభాస్ తో ‘సాహో’ సినిమాని తెరకెక్కించాడు. సినిమా ప్లాప్ అయినప్పటికీ.. సుజీత్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. తన ప్రతిభతో ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, నిర్మాతలను ఆకర్షించిన సుజీత్.. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని తనవైపు తిప్పుకున్నారు. చిరంజీవి నటించే తరవాత సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమచారం. (చదవండి: ‘ఆచార్య’లో మహేశ్.. చిరు స్పందన) మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌హిట్ మూవీ ‘లూసీఫర్’ తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెలుగు రీమేక్ హక్కులను నటుడు–నిర్మాత రామ్‌చరణ్ దక్కించుకున్నారు. ప్రస్తుతం సుజీత్ రీమేక్ స్క్రిప్ట్ రాస్తున్నారట. త్వరలో ఈ సినిమాకి సంబంధించి అధికార ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దసరా సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. -
రికార్డులు సృష్టిస్తున్న సాహో.. కానీ..
మూడు సంవత్సరాల నిరీక్షణ అనంతరం డార్లింగ్ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు సాహో ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది. ఇక బాహుబలి ఎంటర్ అయ్యాడంటే వార్ వన్‌సైడే అంటూ రెబల్ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. పూనకం వచ్చినట్టుగా థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. ఒకవైపేమో సాహో ఆశించిన స్థాయిలో లేదని కొందరు పెదవి విరుస్తుంటే.. మరోవైపేమో ఇండియన్ సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిందని మరి కొందరు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదలైన ఈ చిత్రం రికార్డుల పరంగా చక్రం తిప్పుతోంది. హిందీలో రూ.25 కోట్లకు పైగా షేర్ సాధించి ఈ ఏడాది భారీ ఓపెనింగ్స్ సాధించిన మూడో చిత్రంగా సాహో నిలిచింది. అయితే సాహోతో ప్రభాస్ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా బాహుబలితో తనపేరిట ఉన్న రికార్డును మాత్రం టచ్ చేయలేకపోయారు. విడుదలైన తొలినాడే రూ.121 కోట్లు వసూలు చేసిన బాహుబలి-2 రికార్డును ఈ సినిమా అధిగమించలేకపోయింది. తొలిరోజు సెంచరీ కొట్టిన సాహో రెండు రోజల్లోనే రూ.200 కోట్ల గ్రాస్‌ను అధిగమించింది. డివైడ్ టాక్, తక్కువ రేటింగ్ ఇవేవీ సాహో వసూళ్లపై ప్రభావాన్ని చూపించలేకపోయాయి. వరుస సెలవులు ఉండటంతో సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. హాలీవుడ్‌కు ఏమాత్రం తీసిపోని యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన సాహో మొదటి రోజు కలెక్షన్లతో పలు రికార్డులు మట్టి కొట్టుకుపోయాయి. విడుదలైన తొలిరోజే కలెక్షన్లను కొల్లగొట్టిన హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాల అవెంజర్స్ ఎండ్‌గేమ్ రూ.53 కోట్లు, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ రూ.52 కోట్లు పేరిట ఉన్న రికార్డుల్ని సాహో దెబ్బతో తుడిచిపెట్టుకుపోయాయి. చదవండి: ‘సాహో’ మూవీ రివ్యూ -
సాహో ఫస్ట్ డే కలెక్షన్స్!
బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడం, భారీ బడ్జెట్ చిత్రంగా మునుపెన్నడూ చూడని యాక్షన్ ఎపిసోడ్‌తో సాహో రిలీజ్ అవ్వడంతో రికార్డులు బద్దలు అవుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో.. మొదటి రోజే వసూళ్లలో ప్రభంజనం సృష్టిస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. (‘సాహో’ మూవీ రివ్యూ) జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయడటంతో.. అవేంజర్ ఎండ్‌గేమ్(53కోటు), థగ్స్ ఆఫ్ హిందూస్తాన్(52.25) రికార్డులను క్రాస్ చేస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు కాస్త నెగెటివ్ టాక్ కూడా రావడంతో సినిమా వసూళ్లపై ప్రభావం చూపేలా ఉందని అంటున్నారు. కానీ ఫస్ట్ డే కలెక్షన్లలో మాత్రం రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తోంది. ఈ మూవీ అన్ని భాషల్లో కలిపి దాదాపు 60-70కోట్లు కలెక్ట్ చేయవచ్చని తెలుస్తోంది. తెలుగులో 35, హిందీలో 15-20, తమిళంలో 15కోట్లు మలయాళంలో 5కోట్ల వరకు వసూళ్లను సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్గా నటించింది. యూవీ క్రియేషన్స్‌పై నిర్మించిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించాడు. -
‘సాహో’ ట్రైలర్ వచ్చేసింది
దేశవ్యాప్తంగా హీట్ పెంచేస్తున్న సినిమా సాహో. బాహుబలితో జాతియ స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్.. సాహోతో రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యాడు. ఇదివరకెన్నడూ చూడని యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే టీజర్స్, సాంగ్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సాహో.. యూట్యూబ్‌ను షేక్చేసేందుకు సిద్దమైంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. రెండు వేల కోట్ల రాబరీ.. దాన్ని చేజ్ చేసేందుకు పోలీసులు.. చేజిక్కించుకునేందుకు అండర్ వరల్డ్ డాన్స్.. ఇది వరకు చూడని పోరాట సన్నివేశాలను మన ముందుకు తీసుకొస్తుంది సాహో. ఈ రెండు నిమిషాల 46 సెకన్లలోనే ఈ రేంజ్లో చూపించాము.. ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో ఊహించుకోండి అనేట్టుగా ట్రైలర్‌ను కట్‌చేశారు. అశోక్ చక్రవర్తి అనే క్యారెక్టర్లో ప్రభాస్.. క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో అమృతా నాయర్‌గా శ్రద్దా నటిస్తోంది. ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్నీ ఉన్నాయని తెలిసేట్టుగా ట్రైలర్‌ను డిజైన్ చేసి రిలీజ్ చేశారు. జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, మందిరా బేడీ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సాహో. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. అయితే చివరి నిమిషంలో చిత్ర సంగీత దర్శకులు శంకర్ ఇషాన్ లాయ్‌లు ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. దీంతో సినిమా విడుదల ఆలస్యమవుతుందన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే వార్తలపై చిత్ర దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాహో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు. అంతేకాదు ఈద్ సందర్భంగా జూన్ 5న సాహో కొత్త టీజర్‌ను రిలీజ్ చేయనున్నారట. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన భారత్ సినిమాతో పాటు సాహో టీజర్‌ను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా మరో బ్యూటీ ఇవ్లిన్ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. -
సాహో.. ముహూర్తం ఫిక్స్
బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మరో విజువల్ వండర్ సాహో. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను బాహుబలి స్థాయిలో భారీగా తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీన్స్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను నుంచి మరో అప్ డేట్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా తొలి టీజర్‌ను షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 పేరుతో రిలీజ్ చేసిన చిత్రయూనిట్, మార్చి 3న శ్రద్ధా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా చాప్టర్ 2ను రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. తాజాగా రిలీజ్ టైంను కూడా ప్రకటించారు. ఆదివారం ఉదయం 8 గంటల 20 నిమిషాలకు షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2ను రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. We are all set to light up your weekend & convert it into a #SaahoSunday! 👊 So hold your breath & fasten your seat belts as #ShadesOfSaaho2 arrives tomorrow at 8.20 AM! 😉 #Prabhas @shraddhakapoor @sujeethsign @UV_Creations @saahoofficial pic.twitter.com/ynk3x01jCD — UV Creations (@UV_Creations) 2 March 2019 -
ప్రభాస్ అభిమానులకు డబుల్ ట్రీట్
బాహుబలి సినిమా తరువాత మరోసారి ప్రభాస్ లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. దీంతో యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ప్రభాస్ కొత్త సినిమా అప్డేట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందే సాహో సినిమా టీజర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తరువాత కేవలం ఒక్క పోస్టర్‌తోనే సరిపెట్టారు. అయితే ఈ సారి ప్రభాస్ పుట్టిన రోజు కానుక టీజర్‌తో అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నారట సాహో టీం. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఒక్క రోజు ముందుగానే 22న సాహో సినిమా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు సాహో టీం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సాహో షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్, రాధకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాను కూడా ప్రారంభించాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా అదే రోజు రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సాహో సినిమాకు రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకుడు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. హాలీవుడ్ స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్‌నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ప్రభాస్‌తో గొడవపై దర్శకుడి క్లారిటీ
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న యంగ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం మరో భారీ చిత్రంలో నటిస్తున్నాడు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సాహో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నారు. గత కొద్ది రోజులు ప్రభాస్‌కు చిత్ర దర్శకుడు సుజిత్ కు మధ్య మనస్పర్థలు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. మేకింగ్ విషయంలో ప్రభాస్ సంతృప్తిగా లేడంటూ సాగుతున్న ప్రచారంపై సుజిత్ స్పందించారు. ఓ అభిమాని సోషల్ మీడియా ద్వారా అడిగిన ప్రశ్నకు బదులుగా ‘అలాంటిదేమీ లేదు గురువా! హై కిక్‌లో వర్క్ చేస్తున్నాం.. మధ్యలో ఇలాంటి న్యూస్ మాకు ఎంటర్టైన్మెంట్ అనుకో’ అంటూ ట్వీట్ చేశారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Lol! Nothing is wrong guruva! High kick lo work chestunam.. madhyalo ilanti news maku entertainment anuko. — Sujeeth (@sujeethsign) 14 March 2018 -
ఒక్క షెడ్యూల్‌కే రూ. 40 కోట్లు..!
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్, ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై బహుభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రయూనిట్ ప్రస్తుతం దుబాయ్‌లో మరో షెడ్యూల్‌కు రెడీ అవుతోంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలతో పాటు కొన్ని చేజ్ సీన్లు, యాక్షన్ సీన్లు చిత్రీకరించనున్నారట. అందుకు తగ్గట్టుగా ఈ ఒక్క షెడ్యూల్‌కు భారీ బడ్జెట్‌ను కేటాయించారు చిత్రయూనిట్. కేవలం దుబాయ్‌లో జరిగే షూటింగ్ కోసమే 40 కోట్ల రూపాయలు కేటాయించారట. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, చుంకీ పాండేలు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. -
‘సాహో’.. తాజా అప్డేట్
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో యువి క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సుజిత్(రన్ రాజా రన్ ఫేం) దర్శకుడు. భారీ యాక్షన్ సీన్స్ షూట్ కోసం చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుండగా కొద్ది రోజులుగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. దుబాయ్‌లో అత్యంత భారీ వ్యయంతో సాహో యాక్షన్ సీన్స్‌ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్లో ఫైట్స్ తో పాటు చేజ్ సీన్స్ కూడా చిత్రీకరించాలని భావించారు. అయితే అనుమతుల విషయంలో ఆలస్యం జరగటంతో ఈషెడ్యూల్ ను వాయిదా వేశారన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో దుబాయ్ తరహా సెట్‌ను రూపొందించిన రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేసే అవకాశాలను కూడా చిత్రయూనిట్ పరిశీలించారట. అయితే తాజా సమాచారం ప్రకారం మార్చి మూడో వారం నుంచి దుబాష్ షెడ్యూల్ షూటింగ్ మొదలు కానుందట. అనుమతుల విషయంలో క్లారిటీ రావటంతో ఇప్పటికే కొంత మంది యూనిట్ సభ్యులు దుబాయ్ చేరుకొని ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టేశారు. ఈ షెడ్యూల్లో దుబాయ్, అబుదాబి, రొమేనియాల్లో 60 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఉత్తరాది నటులు నీల్ నితన్ ముఖేష్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, మందిరా బేడిలు కీలక పాత్రలో నటిస్తున్నారు. -
టెన్షన్ పెడుతున్న ప్రభాస్
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్, తన తదుపరి చిత్రం కూడా అదే స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాలో నటిస్తున్నసంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హాలీవుడ యాక్షన్ కొరియోగ్రాఫర్ లు భారీ పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సీన్స్ లో ప్రభాస్ ఎలాంటి డూప్ లేకుండా అన్ని స్టంట్స్తానే చేస్తూ చిత్రయూనిట్ ను కలవరపెడుతున్నాడు. గతంలో బాహుబలి షూటింగ్ సమయంలోనూ కొన్ని ప్రమాధకర స్టంట్స్చేసిన ప్రభాస్ గాయపడ్డాడు. దీంతో సాహో విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నఈ సినిమా యువీ క్రియేషన్స్ సంస్థ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తోంది. ఈ సినిమాను 2018 ఫస్ట్ హాఫ్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
అభిమానులకు ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్
బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా జాతీయ స్థాయి నటుడిగా మారిపోయాడు. అందుకే తన తదుపరి చిత్రం కూడా అదే స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎంతో కాలంగా తనతో సినిమా చేయటం కోసం ఎదురుచూస్తున్న సుజిత్ దర్శకత్వంలో.. సాహో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం సాహో షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్, ఈ నెల 23న తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే టీజర్ ను రిలీజ్ చేసిన సాహో యూనిట్, ప్రభాస్ పుట్టిన రోజున మేకింగ్ వీడియోను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందట. ప్రభాస్ సొంతం నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను 2018లో వేసవికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. -
సాహోపై ఇంట్రస్టింగ్ అప్ డేట్
బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాహో. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రభాస్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని సాహోను కూడా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి 2 రిలీజ్ అయిన చాలా కాలం గడుస్తున్న సాహోకు సంబంధించి ఇంత వరకు ఒక్క అఫీషియల్ అప్ డేట్ కూడా రాలేదు. బాహుబలి 2 రిలీజ్ సమయంలో ఇచ్చిన టీజర్ తప్ప సినిమా వివరాలు ఏవీ ప్రకటించలేదు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు సుజిత్ దృష్టికి తీసుకెళ్లారు. వారికి సమాధానం ఇచ్చిన సుజిత్ ఆగస్టు 15 వరకు వెయిట్ చేయండి అంటూ హింట్ ఇచ్చాడు. అంటే ఆగస్టు 15న సినిమాకు సంబంధించిన బిగ్ ఎనౌన్స్ మెంట్ ఏదో రానుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం సాహో కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉన్నాడు ప్రభాస్. ఇప్పటికే విలన్ నీల్ నితిన్ ముఖేష్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ కోలీవుడ్ కు సంబంధించిన నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. anni fix ipoyayi bhayya.. Aug 15th lopu Ichedham!! — Sujeeth (@sujeethsign) 27 July 2017 -
‘బాహుబలి’ ఫీవర్ మధ్య ప్రభాస్ ట్విస్టు
-
‘బాహుబలి’ ఫీవర్ మధ్య ప్రభాస్ ట్విస్టు
‘సాహో’ అంటూ అభిమనులకు పలుకరింత 2018లో రిలీజ్.. అలరిస్తున్న ప్రభాస్ కొత్త లుక్ దేశమంతా ‘బాహుబలి-2’ ఫీవర్‌తో ఊగిపోతున్న సమయంలో ‘సాహో’ అంటూ ప్రభాస్ కొత్త లుక్‌తో అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ’బాహుబలి-2’ సినిమా శుక్రవారం విడుదల అవుతున్న నేపథ్యంలో ఒకరోజు ముందే ‘సాహో’ టీజర్‌ను అభిమానులకు పరిచయం చేశాడు. గత ఐదేళ్లుగా ‘బాహుబలి’ప్రాజెక్టులో లీనమైన ప్రభాస్ మరో సినిమా చేయని సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక సినిమా తర్వాత ప్రభాస్ ఎలాంటి చిత్రంలో నటిస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో 2018లో సరికొత్త లుక్‌తో అభిమానులను అలరిస్తానంటూ కొత్త టీజర్‌తో ప్రభాస్ ప్రామిస్ చేశాడు. ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ‘సాహో’ టీజర్ గురువారం అధికారికంగా యూట్యూబ్‌లో విడుదలైంది. ఈ టీజర్లో ఏముందంటే.. ఓపెన్ చేస్తే, జూమ్ అవుట్... అవుట్... అవుట్... కట్ చేస్తే ప్రభాస్ కన్ను. మళ్లీ కొంచెం జూమ్ అవుట్ చేస్తే... ముఖంపై రక్తంతో ఓ కుర్చీలో కూర్చున్న ప్రభాస్! అప్పుడు ఓ డైలాగ్. వాయిస్ ఓవర్ (విలన్): ఆ రక్తం చూస్తేనే అర్థమవుతుంది రా... వాణ్ణి చచ్చేంతలా కొట్టారని! (విలన్) అనుచరుడు: సార్... అది వాడి రక్తం కాదు, మన వాళ్లది. కుర్చీలో వెనక్కి పడి ఉన్న ప్రభాస్ మెల్లగా ముఖంపై రక్తాన్ని తుడుచు కుంటూ స్ట్రయిట్‌గా కూర్చుని డైలాగ్ చెబుతారు. అదేంటంటే... ప్రభాస్: ఇట్స్ షో టైమ్! శంకర్-ఎహసన్-లాయ్ త్రయం అందించిన నేపథ్య సంగీతం ఈ టీజర్‌కు స్పెషల్ అట్రాక్షన్. -
నాలుగు రోజుల్లో ప్రభాస్ 19 ఫస్ట్ లుక్..!
బాహుబలి 2 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ తన నెక్ట్స్ సినిమా పనుల్లో వేగం పెంచాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కోసం ప్రత్యేకంగా షూటింగ్ చేసిన చిత్రయూనిట్ ఫస్ట్ లుక్‌ను బాహుబలి రిలీజ్ కన్నా ఐదు రోజుల ముందే విడుదల చేస్తున్నారు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాహో అనే టైటిల్‌ను ఫైనల్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీజర్‌కు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుండగా ఫస్ట్ లుక్ పోస్టర్ ఏప్రిల్ 23న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అదే రోజు ప్రభాస్ లుక్‌తో పాటు టైటిల్‌ను కూడా రివీల్ చేయనున్నారు. తరువాత బాహుబలి 2 సినిమాతో పాటు టీజర్‌ను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి రిలీజ్ అవుతున్న తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో ప్రభాస్ 19 టీజర్‌ను రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఈ సినిమాను 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శంకర్ ఇషాన్ లాయ్‌లు సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ తారను హీరోయిన్గా తీసుకోవాలని భావిస్తున్నారు. -
బాహుబలి 2 కన్నా ఒకరోజు ముందే..!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా బాహుబలి 2. తొలి భాగంతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై సరికొత్త చరిత్ర సృష్టించిన బాహుబలి టీం ఇప్పుడు రెండో భాగంతో తమ రికార్డ్లను తామే బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 28న బాహుబలి ది కంక్లూజన్ ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోంది. అయితే బాహుబలి 2 రిలీజ్‌కు ఒక్క రోజు ముందే తన అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనున్నాడు హీరో ప్రభాస్. బాహుబలి తరువాత ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వంఛరస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ షూటింగ్‌ను కూడా పూర్తి చేసారట. అంతేకాదు ముందుగా అనుకున్నట్టుగా బాహుబలి సినిమాతో పాటు కాకుండా ఒక్క రోజు ముందుగానే అంటే ఏప్రిల్ 27 సాయంత్రమే ప్రభాస్, సుజిత్‌ల సినిమా టీజర్‌ను ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావటంతో ప్రస్తుతం గ్రాఫిక్స్,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జోడించే పనుల్లో యూనిట్ బిజీగా ఉంది. ప్రభాస్ సొంతం నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సాహో టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ హీరోయిన్గా కనిపించే అవకాశం ఉంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
'సాహో' ప్రభాస్..!
త్వరలో బాహుబలి 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ప్రభాస్, తన నెక్ట్స్ సినిమాను కూడా లైన్లో పెట్టాడు. ప్రభాస్‌తో సినిమా చేసేందుకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సుజిత్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎడ్వంచరస్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు బాహుబలి ఫ్లేవర్ అద్దే పనిలో పడ్డారు చిత్రయూనిట్. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డార్లింగ్, నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాహో అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ టైటిల్‌ను నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించింది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌పై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు బాహుబలి 2తో పాటు సాహో టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు, ప్రస్తుతం టీజర్‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే ప్రభాస్, సుజిత్‌ల సినిమా టైటిల్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. -
కొత్త చిత్రానికి ప్రభాస్ కొబ్బరికాయకొట్టాడోచ్
హైదరాబాద్: దాదాపు నాలుగేళ్లపాటు బాహుబలి సినిమాకోసం తీవ్రంగా శ్రమించి బాహుబలి-2కి గత నెల (జనవరి) 6నే గుమ్మడి కాయకొట్టి విశ్రాంతి తీసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్పుడే కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశారు. రన్ రాజా రన్ మూవీ ఫేం సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ సినిమాకు రెడీ అయ్యారు. ఈ చిత్రానికి సంబంధించి పూజకార్యక్రమాలు సోమవారం జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమంలో సుజీత్, చిత్ర నిర్మాతలు, ప్రభాస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బాహుబలి-2 చిత్ర షూటింగ్ పూర్తయ్యాక గడ్డం, పొడుగాటి జుట్టుతోనే కనిపించిన ప్రభాస్.. కొత్త చిత్ర ముహూర్తం రోజు కూడా అదే గెటప్‌లో కనిపించారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు అధికారిగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లలో ఈ సినిమా విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రంపై వస్తోంది. దీనికి శంకర్ ఈ ఎశాన్ లాయ్ సంగీతాన్ని అందించనున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
మూడు భాషల్లో ప్రభాస్ నెక్ట్స్ సినిమా
బాహుబలి సినిమాతో జాతీయ నటుడిగా మారిన ప్రభాస్ ఇమేజ్ను క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ప్రభాస్ హీరోగా తెరకెక్కిన గత చిత్రాలను ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తుండగా, త్వరలో సెట్స్ మీదకు వెళ్లే సినిమాలను ఒకేసారి రెండు, మూడు భాషల్లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. తొలి భాగం లానే ఈ సీక్వల్‌ను కూడా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. బాహుబలి తరువాత రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమాను కూడా భారీగా మల్టీ లాంగ్వేజ్ సినిమాగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ హోం బ్యానర్ యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభాస్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. బాహుబలి లాంటి విజువల్ వండర్తోనే కాకుండా రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో కూడా నార్త్ ప్రేక్షకులను మెప్పించగలిగితే, ప్రభాస్ మార్కెట్‌కు తిరుగుండదన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. -
జూలైలో ప్రభాస్ కొత్త సినిమా
బాహుబలి సినిమా కోసం గత మూడేళ్లుగా మరో సినిమా అంగీకరించకుండా కష్టపడుతున్నాడు హీరో ప్రభాస్. ప్రస్తుతం బాహుబలి 2 కోసం కసరత్తులు చేస్తున్న ఈ మ్యాన్లీ హీరో ఆ సినిమా పూర్తయ్యాక చేయబోయే సినిమా ఏంటో కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. బాహుబలితో తనమీద ఏర్పడ్డ భారీ అంచనాలను కంట్రోల్ చేసేలా తన నెక్ట్స్ సినిమా ఉండాలన్న ఆలోచనలో ఉన్న ప్రభాస్. అందుకు తగ్గట్టుగా ఓ యంగ్ డైరెక్టర్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. బాహుబలి తొలిభాగం పూర్తవ్వగానే, ఆ గ్యాప్‌లో రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావించాడు ప్రభాస్. అయితే బాహుబలి ప్రమోషన్ కోసం ఎక్కువ సమయం పట్టడంతో పాటు బాహుబలికి వచ్చిన రెస్పాన్స్‌తో సుజిత్ సినిమా ఆలోచన విరమించుకున్నాడు. ఈ డిసెంబర్ నుంచి బాహుబలి 2 సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయ్యింది కనుక ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సిన పని ఉండదని భావిస్తున్నారు బాహుబలి యూనిట్. బాహుబలి 2 షూట్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేసి, జూలై 2016 నుంచి నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు ప్రభాస్. మంచి హిట్ తరువాత కూడా వేరే సినిమాలేవీ అంగీకరించకుండా తన కోసమే వెయిట్ చేస్తున్న యంగ్ డైరెక్టర్ సుజిత్ కోసం కూడా వీలైనంత త్వరగా నెక్ట్స్ సినిమా ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. మరి ప్రభాస్ అనుకున్నట్టుగా సినిమా ప్రారంభించడానికి రాజమౌళి బాహుబలి 2ను అనుకున్న సమయానికి పూర్తి చేస్తాడో లేదో. -
సినిమా రివ్యూ: కాస్త... ముందుకు! మరికాస్త... వెనక్కు!!
కొత్త దర్శకులు, కొత్త తరం కథకులు వస్తున్నప్పుడు వెండితెర కొత్తగా వెలుగులీనే అవకాశం ఉంటుందని చిన్న ఆశ ఉంటుంది. వాళ్ళ సినిమా వస్తోందంటే, కొత్తదనం కోరుకొనేవారికి ఎదురుచూపులుంటాయి. లఘు చిత్రాల ద్వారా మొదలుపెట్టి ఫీచర్ ఫిల్మ్‌కు ఎదిగిన దర్శకుడు సుజీత్ ‘రన్ రాజా రన్’ విషయంలోనూ అదే జరిగింది. కథ ఏమిటంటే... రాజా (శర్వానంద్) ఓ కూరగాయల వ్యాపారి కొడుకు. నగర పోలీస్ కమిషనర్ దిలీప్ (సంపత్‌రాజ్) కూతురు ప్రియ (శీరత్ కపూర్)ను ప్రేమిస్తాడు. మరోపక్క నగరంలో వరుసగా జరుగుతున్న ప్రముఖుల కిడ్నాప్‌లు జరుగుతుంటాయి. ఆ కిడ్నాప్‌ల గుట్టు ఛేదించడానికి కమిషనర్ కుస్తీ పడుతుంటాడు. అతని కూతుర్ని ప్రేమించానంటూ వెళ్ళిన హీరోకు కమిషనర్ ఓ కిడ్నాప్ డ్రామా పని అప్పజెపుతాడు. హీరోయిన్నే కిడ్నాప్ చేస్తాడు హీరో. ఆ తరువాత కథేమిటన్నది రకరకాల ట్విస్టుల మధ్య సాగే సినిమా. ఎక్కువగా వినోదాత్మక ఫక్కీలో నడపాలని దర్శకుడు బలవంతాన ప్రయత్నించిన ఈ సినిమాలో హీరో శర్వానంద్ చూడడానికి బాగున్నాడు. అయితే, కొన్నిచోట్ల హెయిర్‌స్టైల్‌లో, హావభావాల్లో తమిళ సూర్యను అనుసరించినట్లు అర్థమైపోతుంటుంది. ఇక, హీరోయిన్ శీరత్ కపూర్ కొత్తమ్మాయి. అభినయంతో పాటు అందమూ తక్కువే. అభినయం తక్కువైనా కథ రీత్యా అడివి శేషుది మరో ముఖ్యపాత్ర. కమిషనర్‌గా సంపత్‌రాజ్, హీరో తండ్రిగా వి. జయప్రకాశ్ అలవాటైన తమిళ ప్రాంతీయ సినీశైలిలో ఫరవాలేదనిపిస్తారు. ఎలా ఉందంటే... తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంగా విడుదల చేయాలనో ఏమో అక్కడి నటులనూ తీసుకున్నారు. వీలున్నప్పుడల్లా హాలులో రజనీకాంత్ నామస్మరణ వినిపిస్తుంది. తమిళ హీరో కార్తి తదితరుల పోస్టర్లూ కనిపిస్తాయి. తమిళ ఫక్కీ సినీ కథన ధోరణి సరేసరి. మది ఛాయాగ్రహణం, గిబ్రాన్ సంగీతం కొత్తగా అనిపిస్తాయి. ముఖ్యంగా పాటల చిత్రీకరణ బాగుంది. ఇప్పటికే పాపులరైన ‘అనగనగనగా అమ్మాయుందిరా’ పాట (రచన శ్రీమణి) చిత్రీకరణ, విలక్షణమైన గొంతు (గోల్డ్ దేవరాజ్)తో పాడించిన తీరు ఆకట్టుకుంటాయి. రామజోగయ్య రాసిన మెలోడీ ‘వద్దంటూనే’ గాయని చిన్మయి గొంతులో వినడానికీ, తెరపై చూడడానికీ బాగుంది. పాటల్లో గొంతులు కొత్తగా అనిపిస్తాయి. అక్కడక్కడ డైలాగ్స నవ్విస్తాయి. కాస్త...కాలక్షేపం! చాలా... కాలహరణం! ప్రథమార్ధం కాలహరణంగా నడిచే సినిమా, సెకండాఫ్‌లో ఫక్తు కాలక్షేపంగా ఫరవాలేదనిపిస్తుంది. కానీ, చివరకొచ్చేసరికి ఆ భావన కూడా బలంగా నిలబడదు. దర్శకుడి అనుభవ రాహిత్యం వల్లనో, లేక అది వినోదమని భ్రమపడడం వల్లనో ఏమో, కథకు అక్కరలేని సన్నివేశాలు కూడా సినిమాలోకి తరచూ చొచ్చుకు వచ్చేస్తుంటాయి. వాటిని స్క్రిప్టు దశలో కాకపోయినా, ఎడిటింగ్ టేబుల్ మీదైనా కత్తిరించుకోవాల్సింది. పోలీసు కమిషనర్, మంత్రి, ఎమ్మెల్యే - ఇలా అందరూ బఫూన్ల లాగా వ్యవహరిస్తారు. ప్రత్యర్థిని అడ్డుకొనేందుకు ఈ వీరశూరసేనులు చేసిందేమీ కనిపించదు. దాంతో, కథలో పాత్రల మధ్య ఆసక్తికరమైన సంఘర్షణ ఏదీ లేకుండా పోయింది. చిత్ర నిర్మాణ విలువలు గణనీయంగానే ఉన్న సినిమా ఇది. రొమాంటిక్ కథగా మొదలై సమాంతరంగా సస్పెన్స్‌ను కొనసాగించి, చివరకొచ్చేసరికి రొటీన్ పగ- ప్రతీకారాల వ్యవహారంగా తేల్చేయడంతో ఈ కథ ఓ పట్టాన సంతృప్తినివ్వదు. కూరగాయలమ్మే వాడి కొడుకు ఇంత ఆధునికంగా ఉన్నాడేమిటి, ఫలానా పాత్ర ఫలానాలా ప్రవర్తిస్తోందేమిటి లాంటి సందేహాలొస్తాయి. చివరలో వాటన్నిటికీ లాజిక్‌లు చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించినా అప్పటికే ఆలస్యమైపోయింది. కొత్తదనం కోసం మరీ విపరీతమైన ట్విస్టులు పెట్టేస్తే ఇబ్బందేనని కథ, కథనం తేల్చేస్తాయి. వెరసి, బాగోగులు రెండూ ఉన్న ఈ చిత్రం జనాన్ని పరిగెత్తించేది ఎటువైపో? తారాగణం: శర్వానంద్, శీరత్ కపూర్, ఎడిటింగ్: మధు, నిర్మాతలు: ప్రమోద్ ఉప్పలపాటి, వంశీకృష్ణారెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుజీత్ బలాలు: కథను వినూత్నంగా చెప్పాలన్న ప్రయత్నం శర్వానంద్ నటన కొత్తగా ధ్వనించే గిబ్రాన్ సంగీతం, గాయకుల గొంతు మది కెమేరా పనితనం, పాటల చిత్రీకరణ బలహీనతలు: సాగదీత కథనశైలి గందరగోళపెట్టే అతి ట్విస్టులు, ఆఖరికి రోలింగ్ టైటిల్స్‌లోనూ సా...గిన కథ ఆఖరుకు పగ, ప్రతీకారాల కథగా మిగలడం పాత్రలు ఎప్పుడుపడితే అప్పుడొచ్చి, వెళ్ళిపోతుండే సీన్లు మొద్దుబారిన ఎడిటింగ్ కత్తెర హీరోయిన్ - రెంటాల జయదేవ -
సినిమా రివ్యూ: రన్ రాజా రన్
నటీనటులు: శర్వానంద్, సీరత్ కపూర్, సంపత్, జయప్రకాశ్, అడివి శేషు, విద్యుల్లేఖ రామన్, కోట శ్రీనివాసరావు తదితరులు. సంగీతం: జిబ్రాన్ కెమెరా: మధి నిర్మాతలు: ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణారెడ్డి దర్శకత్వం: సుజిత్ ప్రస్థానం, జర్ని లాంటి చిత్రాలతో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శర్వానంద్, సీరత్ కపూర్ లు జంటగా దర్శకుడు సుజిత్ రూపొందించిన చిత్రం 'రన్ రాజా రన్'. కిడ్నాప్ డ్రామాకు ప్రేమ కథను జోడించి ఓ యూత్ ఫుల్ చిత్రంగా ప్రేక్షకులకు అందించిన 'రన్ రాజా రన్' ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు ఉందా అనే విషయం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. హైదరాబాద్ నగరంలో ప్రముఖులు మాస్క్ ల పెట్టుకుని ఓ ముఠా వరుస కిడ్నాప్ లు సంచలనం సృష్టిస్తుంటాయి. కిడ్నాప్ ముఠాను పట్టుకునేందుకు దిలీప్ (సంపత్ రాజ్) అనే పోలీస్ కమిషనర్ కు కేసును అప్పగిస్తారు. కథ అలా సాగతుండగా అల్లరి చిల్లరిగా తిరుగుతూ.. చాలా మంది అమ్మాయిలతో లవ్ బ్రేక్ ఆప్ లతో విసిగిపోయిన రాజా హరిశ్చందప్రసాద్ (శర్వానంద్)తో పోలీస్ కమిషనర్ కూతురు ప్రియ (సీరత్ కపూర్) ప్రేమలో పడుతుంది. రాజా, ప్రియల ప్రేమ వ్యవహారం తనకు నచ్చకపోయినా పోలీస్ కమిషనర్ ఒప్పకున్నట్టు నటిస్తాడు. ప్రియ నుంచి దూరం చేయడానికి రాజాను కిడ్నాప్ డ్రామా ఆడాలని ఓ కండిషన్ పెడుతాడు. ప్రియ ప్రేమ కోసం రాజా ఒప్పుకున్నట్టు నటించినా అసలు కారణం మరోకటి అనేది ఈ చిత్రంలో ఓట్విస్ట్. కిడ్నాప్ డ్రామా ఆడేందుకు రాజా ఎందుకు ఒప్పుకున్నాడు? రాజా కిడ్నాప్ వ్యవహారం సఫలమైందా? పోలీస్ కమిషనర్ దిలీప్ కిడ్నాప్ ముఠాను పట్టుకున్నారా? కిడ్నాప్ లకు పాల్పడుతున్నది ఎవరు? అనే పలు సందేహాలను ప్రేక్షకులు కల్పించి దర్శకుడు చెప్పిన సమాధానాలే 'రన్ రాజా రన్'. రాజా పాత్రలో శర్వానంద్ మంచి జోష్ ఉన్న యువకుడిగా కనిపించాడు. స్టైల్స్ తో శర్వానంద్ గతంలో కంటే మరింత ఆకర్షణీయంగా కనిపించాడు. స్టైల్స్ తోపాటు యాక్టింగ్ పరంగా కూడా మంచి ఫెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. యువ హీరోల పోటీలో శర్వానంద్ కు ఈ చిత్రం మరింత పేరు సంపాదించి పెడుతుందని చెప్పవచ్చు. ప్రియగా కనిపించిన సీరత్ కపూర్ అందంతోనూ, అభినయంతోనూ మెప్పించింది. సీరత్ కపూర్ అందచందాలు కనువిందు చేశాయనే చెప్పవచ్చు. గ్లామర్ తారగా సీరత్ కపూర్ రాణించడానికి అన్ని అర్హతలు ఉన్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ చిత్రానికి సీరత్ గ్లామర్ అదనపు ఆకర్షణ. పోలీస్ కమిషనర్ గా సంపత్ తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనించాడు. శర్వానంద్ తండ్రిగా జయప్రకాశ్ ది ఓ ముఖ్యమైన పాత్రే. సంపత్, జయప్రకాశ్ లు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. కోట శ్రీనివాసరావు పాత్ర రొటీన్ గానే ఉంది. టెక్నికల్: మిర్చి చిత్రానికి ఫొటోగ్రఫినందించిన మధి మరోసారి తన సత్తాను చూపించాడు. ఈ చిత్రంలో మధి అందించిన ఫొటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శర్వానంద్, సీరత్ కపూర్ లను గ్లామర్ గా చూపించాడు. ప్రతి ఫ్రేమ్ లోను కలర్స్ వినియోగించిన తీరు బాగుంది. యాక్షన్ సీన్లు, రొమాంటిక్ సీన్లను తెరకెక్కించిన విధానం 'రన్ రాజా రన్'కు హైలెట్ నిలుస్తాయని చెప్పవచ్చు. రాజ్ సుందరం అందించిన కోరియోగ్రఫీ పాటలకు మరింత ట్రేండిగా మార్చాయి. కిడ్నాప్ కథ బ్యాక్ డ్రాప్ గా 'రన్ రాజా రన్'ను ఓ అందమైన ప్రేమ కథగా మలచడంలో దర్శకుడు సుజీత్ కొంతమేరకు సఫలమయ్యాడనే చెప్పవచ్చు. అయితే కథనంలో వేగం మందగించడం కారణంగా మధ్య, మధ్యలో కొంత ల్యాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కోసమే కథను సా...గదీశాడా అనే కోణం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే తెలుగు, తమిళ, హిందీ హీరోలు, రాజకీయ నాయకులు, క్రికెటర్ల మాస్క్ లతో వెరైటీగా కిడ్నాప్ ముఠాను దర్శకుడు వెరైటీగా డిజైన్ చేసిన తీరు ప్రశంసనీయం. చిత్ర ఫస్టాఫ్, సెకండాఫ్ లో నిడివి ఎక్కువగా ఉండటం వలన కథలో వేగానికి కళ్లెం వేసిందనే ఫీలింగ్ కలుగుతుంది. చిత్ర నిడివిని తగ్గించడానికి ఎడిటింగ్ విభాగంపై మరికొంత దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపించింది. ప్రమోద్, కృష్ణారెడ్డిల నిర్మాణాత్మక విలువులు బాగున్నాయి.