సాహోపై ఇంట్రస్టింగ్ అప్ డేట్ | Sahoo team ready to Surprise Prabhas fans | Sakshi
Sakshi News home page

సాహోపై ఇంట్రస్టింగ్ అప్ డేట్

Published Sat, Jul 29 2017 3:31 PM | Last Updated on Wed, Jul 17 2019 10:14 AM

సాహోపై ఇంట్రస్టింగ్ అప్ డేట్ - Sakshi

సాహోపై ఇంట్రస్టింగ్ అప్ డేట్

బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా సాహో. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రభాస్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని సాహోను కూడా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

బాహుబలి 2 రిలీజ్ అయిన చాలా కాలం గడుస్తున్న సాహోకు సంబంధించి ఇంత వరకు ఒక్క అఫీషియల్ అప్ డేట్ కూడా రాలేదు. బాహుబలి 2 రిలీజ్ సమయంలో ఇచ్చిన టీజర్ తప్ప సినిమా వివరాలు ఏవీ ప్రకటించలేదు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ ఫ్యాన్స్ దర్శకుడు సుజిత్ దృష్టికి తీసుకెళ్లారు. వారికి సమాధానం ఇచ్చిన సుజిత్ ఆగస్టు 15 వరకు వెయిట్ చేయండి అంటూ హింట్ ఇచ్చాడు.

అంటే ఆగస్టు 15న సినిమాకు సంబంధించిన బిగ్ ఎనౌన్స్ మెంట్ ఏదో రానుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం సాహో కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉన్నాడు ప్రభాస్. ఇప్పటికే విలన్ నీల్ నితిన్ ముఖేష్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ కోలీవుడ్ కు సంబంధించిన నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement