జూలైలో ప్రభాస్ కొత్త సినిమా
బాహుబలి సినిమా కోసం గత మూడేళ్లుగా మరో సినిమా అంగీకరించకుండా కష్టపడుతున్నాడు హీరో ప్రభాస్. ప్రస్తుతం బాహుబలి 2 కోసం కసరత్తులు చేస్తున్న ఈ మ్యాన్లీ హీరో ఆ సినిమా పూర్తయ్యాక చేయబోయే సినిమా ఏంటో కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. బాహుబలితో తనమీద ఏర్పడ్డ భారీ అంచనాలను కంట్రోల్ చేసేలా తన నెక్ట్స్ సినిమా ఉండాలన్న ఆలోచనలో ఉన్న ప్రభాస్. అందుకు తగ్గట్టుగా ఓ యంగ్ డైరెక్టర్తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
బాహుబలి తొలిభాగం పూర్తవ్వగానే, ఆ గ్యాప్లో రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావించాడు ప్రభాస్. అయితే బాహుబలి ప్రమోషన్ కోసం ఎక్కువ సమయం పట్టడంతో పాటు బాహుబలికి వచ్చిన రెస్పాన్స్తో సుజిత్ సినిమా ఆలోచన విరమించుకున్నాడు. ఈ డిసెంబర్ నుంచి బాహుబలి 2 సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయ్యింది కనుక ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సిన పని ఉండదని భావిస్తున్నారు బాహుబలి యూనిట్.
బాహుబలి 2 షూట్ను వీలైనంత త్వరగా పూర్తిచేసి, జూలై 2016 నుంచి నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు ప్రభాస్. మంచి హిట్ తరువాత కూడా వేరే సినిమాలేవీ అంగీకరించకుండా తన కోసమే వెయిట్ చేస్తున్న యంగ్ డైరెక్టర్ సుజిత్ కోసం కూడా వీలైనంత త్వరగా నెక్ట్స్ సినిమా ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. మరి ప్రభాస్ అనుకున్నట్టుగా సినిమా ప్రారంభించడానికి రాజమౌళి బాహుబలి 2ను అనుకున్న సమయానికి పూర్తి చేస్తాడో లేదో.