శర్వానంద్ హీరోగా వచ్చిన రన్ రాజా రన్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సుజీత్.. తన రెండో చిత్రాన్నే స్టార్ హీరో ప్రభాస్ తో చేసే ఛాన్స్ కొట్టేశాడు. పాన్ ఇండియా మూవీగా ప్రభాస్ తో ‘సాహో’ సినిమాని తెరకెక్కించాడు. సినిమా ప్లాప్ అయినప్పటికీ.. సుజీత్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. తన ప్రతిభతో ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, నిర్మాతలను ఆకర్షించిన సుజీత్.. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని తనవైపు తిప్పుకున్నారు. చిరంజీవి నటించే తరవాత సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమచారం.
(చదవండి: ‘ఆచార్య’లో మహేశ్.. చిరు స్పందన)
మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌హిట్ మూవీ ‘లూసీఫర్’ తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెలుగు రీమేక్ హక్కులను నటుడు–నిర్మాత రామ్‌చరణ్ దక్కించుకున్నారు. ప్రస్తుతం సుజీత్ రీమేక్ స్క్రిప్ట్ రాస్తున్నారట. త్వరలో ఈ సినిమాకి సంబంధించి అధికార ప్రకటన వెలువడనుంది.
ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దసరా సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment