మూడు భాషల్లో ప్రభాస్ నెక్ట్స్ సినిమా | bahubali prabhas next to be a multilingual | Sakshi
Sakshi News home page

మూడు భాషల్లో ప్రభాస్ నెక్ట్స్ సినిమా

Published Fri, May 27 2016 1:02 PM | Last Updated on Mon, Sep 4 2017 1:04 AM

మూడు భాషల్లో ప్రభాస్ నెక్ట్స్ సినిమా

మూడు భాషల్లో ప్రభాస్ నెక్ట్స్ సినిమా

బాహుబలి సినిమాతో జాతీయ నటుడిగా మారిన ప్రభాస్ ఇమేజ్ను క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే ప్రభాస్ హీరోగా తెరకెక్కిన గత చిత్రాలను ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తుండగా, త్వరలో సెట్స్ మీదకు వెళ్లే సినిమాలను ఒకేసారి రెండు, మూడు భాషల్లో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.

ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. తొలి భాగం లానే ఈ సీక్వల్ను కూడా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. బాహుబలి తరువాత రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమాను కూడా భారీగా మల్టీ లాంగ్వేజ్ సినిమాగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ హోం బ్యానర్ యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభాస్కు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. బాహుబలి లాంటి విజువల్ వండర్తోనే కాకుండా రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో కూడా నార్త్ ప్రేక్షకులను మెప్పించగలిగితే, ప్రభాస్ మార్కెట్కు తిరుగుండదన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement