
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్, తన తదుపరి చిత్రం కూడా అదే స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాలో నటిస్తున్నసంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హాలీవుడ యాక్షన్ కొరియోగ్రాఫర్ లు భారీ పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సీన్స్ లో ప్రభాస్ ఎలాంటి డూప్ లేకుండా అన్ని స్టంట్స్‌తానే చేస్తూ చిత్రయూనిట్ ను కలవరపెడుతున్నాడు.
గతంలో బాహుబలి షూటింగ్ సమయంలోనూ కొన్ని ప్రమాధకర స్టంట్స్‌చేసిన ప్రభాస్ గాయపడ్డాడు. దీంతో సాహో విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నఈ సినిమా యువీ క్రియేషన్స్ సంస్థ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తోంది. ఈ సినిమాను 2018 ఫస్ట్ హాఫ్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment