డెంటిస్ట్‌తో‌ ప్రేమ.. జూన్‌ 10న నిశ్చితార్థం? | Saaho Fame Sujeeth To Get Engaged With Pravallika On 10th June | Sakshi
Sakshi News home page

జూన్‌ 10న ‘సాహో’ దర్శకుడి నిశ్చితార్థం!

Published Thu, Jun 4 2020 2:07 PM | Last Updated on Thu, Jun 4 2020 2:08 PM

Saaho Fame Sujeeth To Get Engaged With Pravallika On 10th June - Sakshi

హైదరాబాద్‌: ‘సాహో’ చిత్ర దర్శకుడు సుజీత్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవలే  నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్, కమెడియన్ మహేష్ వరుసగా ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. ఇదే జాబితాలో సుజిత్‌ కూడా త్వరలో చేరనున్నారు. ప్రవళిక అనే డెంటిస్ట్‌తో గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ యంగ్‌ డైరెక్టర్ పెద్దల అంగీకారంతో‌ త్వరలోనే ఆమె మెడలో మూడు ముళ్లు వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్‌ 10న హైదరాబాద్‌లో సుజీత్‌-ప్రవళికల నిశ్చితార్థం ఉండనున్నట్లు సమాచారం. (హ్యాపీ బర్త్‌డే ‘కామ్రేడ్‌ భారతక్క’)

లాక్‌డౌన్‌ కారణంగా ఎంగేజ్‌మెంట్‌ చాలా సింపుల్‌గా జరగనుందని, ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలిసింది. నిశ్చితార్థం రోజునే పెళ్లి తేదీపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉందని టాలీవుడ్‌ టాక్‌. అయితే ఈ వార్తలపై సుజీత్‌ ఇప్పటివరకు స్పందించలేదు. ఇక రన్‌రాజాతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమైన సుజీత్‌ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో హాలీవుడ్‌ రేంజ్‌లో తీసిన ‘సాహో’ చ్రితంతో ఫుల్‌ ఫేమ్‌తో పాటు క్రేజ్‌ సాధించాడు. దీంతో తన మూడో చిత్రం మెగాస్టార్‌తో తీసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ‘లూసిఫర్‌’ రీమేక్‌ను తెలుగులో ఈ యువ దర్శకుడే డైరెక్ట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. (మహేశ్‌తో మరో సినిమా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement