ఒక్క షెడ్యూల్‌కే రూ. 40 కోట్లు..! | Prabhas Saaho Dubai Schedule Costs 40 Crores | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 3 2018 12:54 PM | Last Updated on Sat, Mar 3 2018 4:47 PM

Prabhas Saaho Dubai Schedule Costs 40 Crores - Sakshi

‘సాహో’ సినిమాలో ప్రభాస్‌

బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్‌, ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్‌ బ్యానర్‌పై బహుభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రయూనిట్‌ ప్రస్తుతం దుబాయ్‌లో మరో షెడ్యూల్‌కు రెడీ అవుతోంది.

ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలతో పాటు కొన్ని చేజ్‌ సీన్లు, యాక్షన్‌ సీన్లు చిత్రీకరించనున్నారట. అందుకు తగ్గట్టుగా ఈ ఒక్క షెడ్యూల్‌కు భారీ బడ్జెట్‌ను కేటాయించారు చిత్రయూనిట్‌. కేవలం దుబాయ్‌లో జరిగే షూటింగ్ కోసమే 40 కోట్ల రూపాయలు కేటాయించారట. ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటులు నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మందిరా బేడీ, చుంకీ పాండేలు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement