ఆసిన్ ప్రేమకు బ్రేకప్ | Asin love Breakup | Sakshi
Sakshi News home page

ఆసిన్ ప్రేమకు బ్రేకప్

Published Thu, Jul 2 2015 8:06 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఆసిన్ ప్రేమకు బ్రేకప్ - Sakshi

ఆసిన్ ప్రేమకు బ్రేకప్

చెన్నై: నటి ఆసిన్ ప్రేమ బ్రేకప్ అయినట్లు బాలీవుడ్‌లో ప్రచారం హోరెత్తుతోంది. తెలుగు,తమిళ భాషల్లో ప్రముఖ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమె గజినీ చిత్రంతో బాలీవుడ్ రంగప్రవేశం చేశారు. తొలి చిత్రంతోనే అక్కడ యమ క్రేజ్‌ను సంపాదించుకున్న ఆసిన్‌కు హిందీలో అవకాశాలు వెల్లువెత్తాయి. గజినీ తరువాత సల్మాన్‌ఖాన్‌తో రెడీ, అక్షయకుమార్ సరసన హౌస్‌ఫుల్ 2, కిలాడి 786, అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా భోల్ బచ్చన్ భోల్  చిత్రాల్లో నటించారు.
 
 ఆ సమయంలోనే బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్‌తో ప్రేమాయణం నడిపారు. అయితే కొంతకాలం తరువాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తరువాత ఆసిన్ ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాకుల్‌శర్మతో పరిచయం ప్రేమగా మారిందనే ప్రచారం జోరుగా సాగింది. దాన్ని ఈ ప్రేమ జంట ఖండించలేదు. అలా 2013 నుంచి సాగిన ఆసిన్ రాకుల్‌ల ప్రేమకు తాజాగా బ్రేక్ పడిందని బాలీవుడ్ వర్గాల బోగట్టా. ప్రస్తుతం ఆల్‌ఈజ్ వెల్ చిత్రంలో ఆసిన్, అభిషేక్‌బచ్చన్ జంటగా నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement