
ప్రభాస్‌కు విలన్!
ఆరడుగుల ఎత్తు. ఏనుగునైనా లొంగదీయగల కండ బలం. ఆపదలో ఆలోచననే ఆయుధంగా వాడల బుద్ధి బలం. ఇలాంటి లక్షణాలు ఉన్న ఓ హీరోతో పోటీపడాలంటే ఆ శత్రువు ఎలా ఉండాలి. ఎత్తుకు పై ఎత్తు వేయాలి. పరిస్థితుల్ని వాడాలి. అదును చూసి దెబ్బకొట్టాలి. ఈ దెబ్బకు హీరో దిమ్మ తిరగాలి. ఇలాంటి విలన్‌ను గెలిస్తేనే కదా ఈ హీరో సత్తా ఏంటో మరింత తెలిసేది. ప్రస్తుతం ‘సాహో’టీమ్ అదే పనిలో ఉందట.
ఎందుకంటే పై లక్షణాలన్నీ ఈ చిత్ర కథానాయకుడికి ఉంటాయట. ఇందులో ప్రభాస్ హీరో అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోకి పోటాపోటీగా ఉండాలని విలన్‌గా బాలీవుడ్ యాక్టర్ నీల్ నితిన్ ముఖేష్‌ను తీసుకున్నారట. బాలీవుడ్ చిత్రాలు ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’, ‘ప్లేయర్స్’, ‘వాజిర్’ వంటి చిత్రాల్లో నితిన్ ముఖేష్‌నే విలన్. మురగదాస్ డైరెక్షన్‌లో వచ్చిన ‘కత్తి’ సినిమాలోనూ విలన్‌గా ఇరగదీశాడు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ డైరెక్షన్‌లో యూవీ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సినిమా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని సమాచారం.