విలన్‌ను మిస్‌ అవుతున్న హీరో! | Bellamkonda Sreenivas Tweet About Neil Nitin Mukesh | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 13 2018 9:56 AM | Last Updated on Tue, Oct 30 2018 6:01 PM

Bellamkonda Sreenivas Tweet About Neil Nitin Mukesh - Sakshi

‘జయ జానకి నాయకా’ లాంటి హిట్‌ సినిమా తరువాత ‘సాక్ష్యం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. అయితే సాక్ష్యం మాత్రం ఈ హీరోకి అంతగా కలిసి రాలేదు. ఇక ఈ సినిమా ఫలితం తన తదుపరి చిత్రాలపై ప్రభావం చూపనుంది. 

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ అగార్వాల్‌ కలిసి ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ కీలక పాత్రలో నటిస్తుండగా.. ప్రస్తుతం ఈ విలన్‌కు సంబంధించిన యాక్షన్‌ పార్ట్‌ షూటింగ్‌ను కంప్లీట్‌ చేసేసింది చిత్ర యూనిట్‌. అయితే ఇదే విషయాన్ని ట్విటర్‌ ద్వారా తెలియజేస్తూ.. తనతో వర్క్‌ చేయడం చాలా సరదాగా ఉందంటూ ట్వీట్‌ చేశాడు మన హీరో. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వంశధార క్రియేషన్స్‌పై నవీన్‌ శొంటినేని నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement