
ఇందు సర్కార్
భారత దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా మధుర్ బండార్కర్ తెరకెక్కించిన చిత్రం ‘ఇందు సర్కార్’. ఆమె విధించిన ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇందిరా గాంధీ పాత్రను సుప్రియా వినోద్ చేశారు. ఇందిరాగాంధీ రెండో తనయుడు సంజయ్‌గాంధీ రోల్‌ను నీల్ నితిన్ ముఖేష్ చేశారు. ఇందు అనే అమ్మాయి పాత్రను కృతీ కుల్హరీ చేశారు.
నిజ జీవిత కథలను తెరెకెక్కించడంలో మధుర్ బండార్కర్ ప్రతిభావంతుడు. ఈ చిత్రం పై అంచనాలు పెరగడానికి అదో కారణమైతే మరో కారణం సుప్రియ, నీల్ నితిన్ లుక్స్. అచ్చంగా ఇందిరా గాంధీలా సుప్రియ లుక్, సంజయ్‌లా నీల్ లుక్ ఉండటం విశేషం. పాత్రలకు తగ్గ ఆర్టిస్టులను ఎన్నుకోవడంలో మధుర్ సిద్ధహస్తుడని లుక్స్ చూసినవాళ్లు అంటున్నారు. ఈ సినిమా జూలై 28న విడుదల కానుంది.