బెల్లంకొండ కొత్త సినిమా 'జయ జానకి నాయక' | Bellamkonda Boyapati Movie title Jaya Janaki Nayaka | Sakshi
Sakshi News home page

బెల్లంకొండ కొత్త సినిమా 'జయ జానకి నాయక'

Published Fri, Jun 16 2017 3:46 PM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

Bellamkonda Boyapati Movie title Jaya Janaki Nayaka

స్టార్ వారసుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న మూడో సినిమా టైటిల్ను ఎనౌన్స్ చేశారు. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జయ జానకీ నాయక అనే టైటిల్ను నిర్ణయించారు. ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, కేథరిన్ థెరిస్సాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిరయాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈసినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం సాంగ్ షూటింగ్ జరుపుకుంటోంది.

అల్లుడు శీను సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న ఈ యంగ్ హీరో రెండో సినిమా తీవ్రంగా నిరాశపరచటంతో మూడో సినిమాను మరోసారి భారీగా.. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బోయపాటి లాంటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడితో.. పాటు సీనియర్ యాక్టర్స్, టాప్ క్లాస్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement