
ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఉంది
– బోయపాటి శ్రీను
‘‘టైటిల్ వినగానే సర్‌ప్రైజ్ అవుతారు. నా మార్క్, వేరే మార్క్ అని కాకుండా కథకు ఏ మార్క్ సూటవుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ‘జయ జానకి నాయక ’ టైటిల్ పెట్టాం. ఇది క్యూట్ లవ్‌స్టోరీ. సినిమా చూశాక టైటిల్ యాప్ట్ అని ప్రేక్షకులు అనుకుంటారు. ఫ్యామిలీ, ఎమోషన్స్, డ్రామా ఇలా అన్ని అంశాలు ఉన్న సినిమా. డిఫరెంట్ టేస్ట్ ఉన్న ప్రేక్షకులు ఒకే వరుసలో కూర్చుని చూసేలా ఈ సినిమా ఉంటుంది’’ అని బోయపాటి శ్రీను అన్నారు. బెల్లకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘జయ జానకి నాయక’.
మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్యారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఆగస్టు 11న రిలీజ్ కానున్న ఈ సినిమా టైటిల్, లోగోను శుక్రవారం ఆవిష్కరించారు. హీరో మాట్లాడుతూ– ‘‘ఇది నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. నాలో ఏం నచ్చి బోయపాటిగారు సెలెక్ట్ చేసుకున్నారో నాకు తెలీదు. ఆయనతో సినిమా చేయడం హ్యాపీ. బోయపాటిగారి ఎనర్జీ, సినిమా పట్ల ఆయనకున్న ప్యాషన్ వెరీ స్పెషల్’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘బోయపాటి లాంటి డైరెక్టర్‌తో సినిమా తీస్తున్నామంటే ఇక మిగతాదంతా సెకండ్రీ. ఆయనకేం ఇవ్వాలో అది ఇస్తే మంచి రిజల్ట్ వస్తుందనే నమ్మకంతో సినిమా స్టార్ట్ చేశాం.
టాకీ పార్ట్ పూర్తయింది. బ్యాలెన్స్ మాంటేజ్ సాంగ్ చిత్రీకరణ ఈ 18న మొదలుపెడతాం. మరో పాట చిత్రీకరణను వచ్చే నెల 11న ఆరంభిస్తాం. రీ–రికార్డింగ్‌ను ఈ నెలాఖరుకల్లా కంప్లీట్ చేసి, వచ్చే నెల ఆడియో విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘సినిమాలు లేనప్పుడు నాకు ‘లెజెండ్’లో జితేంద్ర క్యారెక్టర్ ఇచ్చి ఈ స్థాయికి ఎదిగేలా చేశాడు బోయపాటి. అలాగే సాయి శ్రీనివాస్‌ని కూడా ఈ సినిమాతో మంచి స్థాయికి తీసుకెళతాడు. నిర్మాత ఖర్చుకు వెనకాకుండా తీస్తున్నారు’’ అని జగపతిబాబు అన్నారు. ‘‘టైటిల్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సాయి కెరీర్‌కు ఈ సినిమా మంచి మైలేజ్ అవ్వాలి’’ అన్నారు శరత్‌కుమార్. ‘‘ఇందులో నా పాత్ర పేరు జానకి. ‘సరైనోడు’ తర్వాత మళ్లీ బోయపాటి గారితో సినిమా చేయడం ఆనందగా ఉంది’’ అన్నారు రకుల్.