బోయపాటి నెక్ట్స్.. మెగా హీరోతోనా..! | Boyapati Sreenu next movie wIth Ram Charan | Sakshi
Sakshi News home page

బోయపాటి నెక్ట్స్.. మెగా హీరోతోనా..!

Published Tue, Aug 29 2017 12:40 PM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM

బోయపాటి నెక్ట్స్.. మెగా హీరోతోనా..!

బోయపాటి నెక్ట్స్.. మెగా హీరోతోనా..!

జయ జానకి నాయక సినిమాతో మరోసారి సత్తా చాటిన మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను, తన నెక్ట్స్ సినిమా పనుల్లో బిజీ అవుతున్నాడు. కొత్త హీరోతో కూడా మంచి బిజినెస్ చేసిన బోయపాటి నెక్ట్స్ సినిమాను మాత్రం స్టార్ హీరోతోనే చేయాలని ఫిక్స్ అయ్యాడు. అంతేకాదు ఇప్పటికే కథ కూడా రెడీ చేసుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మెగా కాంపౌండ్ లో సరైనోడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న బోయపాటి, మరోసారి మెగా హీరోతోనే సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమా చేస్తున్న రామ్ చరణ్ తో తన నెక్ట్స్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. చరణ్ కూడా రంగస్థలం తరువాత చేయబోయే సినిమాను ఇంతవరకు ప్రకటించలేదు. దీంతో బోయపాటి తో చరణ్ సినిమా కన్ఫామ్ అన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో నిర్మించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ కాంబినేషన్ పై ఎలాంటి ప్రకటన లేకపోయినా.. వరుసగా ధృవ, రంగస్థలం 1985 లాంటి ప్రయోగాలు చేస్తున్న చరణ్, ఈ సారి మాస్ కథకే ఓటేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement