మాస్‌ మార్కే కాపాడిందా..? | Vinaya Vidheya Rama Mass Formula Help Ram Charan Film | Sakshi
Sakshi News home page

Jan 20 2019 11:16 AM | Updated on Jan 20 2019 11:17 AM

Vinaya Vidheya Rama Mass Formula Help Ram Charan Film - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, మాస్‌ యాక్షన్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ వినయ విధేయ రామ. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి రోజు నుంచే ఈ సినిమాకు డివైడ్‌ టాక్‌ రావటంతో సినిమాకు భారీ నష్టాలు తప్పవని భావించారు. కానీ వసూళ్ల పరంగా చూస్తే సీన్స్‌ రివర్స్‌ అయ్యింది.

సంక్రాంతి సెలవులను క్యాష్ చేసుకున్న వినయ విధేయ రామ మంచి వసూళ్లను సాధిస్తోంది. ముఖ్యంగా ఆరు రోజుల్లో ఈ సినిమా 60 కోట్లకుపైగా వసూళ్లు సాధించటంతో డిస్ట్రిబ్యూటర్‌లు నష్టాల నుంచి చాలా వరకు బయటపడ్డట్టుగా తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో బ్రేక్‌ ఈవెన్‌ కూడా సాధించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు సన్నివేశాలు కాస్త అతిగా అనిపించినా.. బోయపాటి మార్క్‌ మాస్‌ యాక్షనే సినిమాను కాపాడిందన్న టాక్‌ వినిపిస్తోంది. బీ, సీ సెంటర్స్‌ రెస్పాన్స్‌ బాగుండటం కలెక్షన్ల విషయంలో ప్రభావం చూపించింది. జనవరి 25 వరకు రిలీజ్‌లు లేకపోవటం కూడా వినయ విధేయ రామకు కలిసొస్తుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement