మగధీరను గుర్తు చేస్తున్న చెర్రీ | Ram Charan Vinaya Vidheya Rama Audio Release Poster | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 26 2018 3:13 PM | Last Updated on Wed, Dec 26 2018 3:13 PM

Ram Charan Vinaya Vidheya Rama Audio Release Poster - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న కమర్షియల్ మాస్‌ ఎంటర్‌టైనర్‌ వినయ విధేయ రామ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. గురువారం థియట్రికల్‌ ట్రైలర్‌, ఆడియో రిలీజ్‌ వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన  పోస్టర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. గుర్రం మీద ఉన్న రామ్‌ చరణ్‌ స్టిల్‌ మరోసారి మగధీరను గుర్తు చేస్తోంది. టాలీవుడ్‌ హీరోలు సైతం ఈ పోస్టర్‌ను రీ ట్వీట్‌ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. రంగస్థలం లాంటి ప్రయోగం తరువాత చరణ్ చేస్తున్న మాస్‌యాక్షన్‌ సినిమా కావటంతో వినయ విధేయ రామపై భారీ అంచనాలే ఉన్నాయి. చెర్రీ సరసన భరత్‌ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. సీనియర్‌ హీరోలు ప్రశాంత్‌, ఆర్యన్ రాజేష్‌లు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement