స్టార్ వారసుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న మూడో సినిమా జయ జానకీ నాయక. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను శుక్రవారం ఉదయం రిలీజ్ చేశారు. బోయపాటి సినిమా తరహా మాస్ లుక్ కాకుండా ఫస్ట్ లుక్ లో హీరోను లవర్ బాయ్గా పరిచయం చేశారు. ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిరయాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం సాంగ్ షూటింగ్ జరుపుకుంటోంది.అల్లుడు శీను సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న ఈ యంగ్ హీరో రెండో సినిమా తీవ్రంగా నిరాశపరచటంతో మూడో సినిమాను మరోసారి భారీగా.. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బోయపాటి లాంటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడితో.. పాటు సీనియర్ యాక్టర్స్, టాప్ క్లాస్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.