జానకీ నాయకుణ్ణి అందరూ ఇష్టపడతారు : బోయపాటి శ్రీను | jaya janaki nayaka movie release date on 11th august | Sakshi
Sakshi News home page

జానకీ నాయకుణ్ణి అందరూ ఇష్టపడతారు : బోయపాటి శ్రీను

Published Thu, Aug 10 2017 11:57 PM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

జానకీ నాయకుణ్ణి అందరూ ఇష్టపడతారు : బోయపాటి శ్రీను - Sakshi

జానకీ నాయకుణ్ణి అందరూ ఇష్టపడతారు : బోయపాటి శ్రీను

‘‘భద్ర’ తర్వాత నేను చేసిన తులసి, సింహా, దమ్ము, లెజెండ్, సరైనోడు’ సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకమైనవి. ‘భద్ర’ సినిమా తర్వాత నేను చేసిన బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీ ‘జయ జానకి నాయక’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్, ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్లుగా మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ‘జయ జానకి నాయక’ ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘లవ్, ఎమోషన్స్, యాక్షన్‌ అన్నీ ఉన్న కథ ఇది. ఫీల్‌ గుడ్, ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌.

మాస్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులూ మా జానకీ నాయకుణ్ణి ఇష్టపడతారు. నేను పని చేసిన నిర్మాతలందరితో హ్యాపీ. అల్లు అరవింద్‌గారితో ‘సరైనోడు’ చేశా. ఎంతో కంఫర్ట్‌బుల్‌ ప్రొడ్యూసర్‌. ఆ రేంజ్‌లో రవీందర్‌రెడ్డి సినిమా చేశాడు. ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ఇలాంటి నిర్మాతలు మనకు ఎంతో అవసరం’’ అన్నారు. మిర్యాల రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకు బోయపాటిగారు 6 సినిమాలు చేస్తే, అన్నీ హిట్టే. ఆయన సినిమాల్లో ‘జయ జానకి నాయక’ బెస్ట్‌ మూవీ అని చెప్పగలను. సినిమాకు మంచి కథ కుదరడమే తొలి సక్సెస్‌. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారు’’ అన్నారు. ‘‘కొన్ని సినిమాలను ఇది నా సినిమా అని గర్వంగా చెప్పుకుంటాం.

 ‘ఇది నా సినిమా’ అని జీవితాంతం చెప్పుకునేలా ‘జయ జానకి నాయక’ ఉంటుంది’’ అని సాయిశ్రీనివాస్‌ అన్నారు. ‘‘ఈ సినిమాలో జానకి పాత్ర చేసే అవకాశం రావడం నా అదృష్టం. ప్రేక్షకులకు నా క్యారెక్టర్, స్ట్రాంగ్‌ ఎమోషన్‌ కనెక్ట్‌ అవుతాయి’’ అని రకుల్‌ ప్రీత్‌సింగ్‌ చెప్పారు. ‘‘సినిమా అందర్నీ అలరించే విధంగా ఉంటుంది’’ అన్నారు ప్రగ్యా జైస్వాల్‌. నటుడు నందు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement