జయ జానకి నాయకకు వంద థియేటర్లు పెరిగాయ్..! | Jaya Janaki Nayaka gets 100 more screens | Sakshi
Sakshi News home page

జయ జానకి నాయకకు వంద థియేటర్లు పెరిగాయ్..!

Published Sun, Aug 20 2017 11:26 AM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

జయ జానకి నాయకకు వంద థియేటర్లు పెరిగాయ్..! - Sakshi

జయ జానకి నాయకకు వంద థియేటర్లు పెరిగాయ్..!

సాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 11న విడుదలైన సినిమాల్లో తక్కువ థియేటర్లలో రిలీజ్ అయి కూడా మంచి వసూళ్లు సాధించిన సినిమా జయ జానకి నాయక. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి షో నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే తొలి వారం భారీ పోటి కారణంగా ఎక్కువగా థియేటర్లు దక్కకపోవటంతో ఇప్పుడు థియేటర్లు పెంచే పనిలో పడ్డారు నిర్మాతలు.

తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల్లో 14 కోట్లకు పైగా వసూలు చేసి ఈ సినిమాకు తాజాగా మరో వంద థియేటర్లు పెంచారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తుండటం జయ జానకి నాయకకు కలిసోస్తోంది. ఈ వారం భారీ సినిమాలేవి విడుదల కాకపోవటంతో పాటు థియేటర్ల సంఖ్య కూడా పెరగటంతో జయ జానకి నాయకకు కలెక్షన్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement