బోయపాటి మార్క్కు భారీ ప్రైజ్..! | Jaya Janaki Nayaka Satellite Fetches 12 cr | Sakshi
Sakshi News home page

బోయపాటి మార్క్కు భారీ ప్రైజ్..!

Published Thu, Aug 10 2017 10:22 AM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

బోయపాటి మార్క్కు భారీ ప్రైజ్..! - Sakshi

బోయపాటి మార్క్కు భారీ ప్రైజ్..!

మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లతో వరుస విజయాలు సాధిస్తున్న బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం జయ జానకి నాయక. యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. బోయపాటి మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (11-08-2017) ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా శాటిలైట్ బిజినెస్ లోనూ సత్తా చాటింది. హీరో కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్స్ లేకపోయినా బోయపాటి ఇమేజ్ కారణం సినిమా బిజినెస్ భారీగానే జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు కేవలం శాటిలైట్ రైట్స్ 12 కోట్లకు అమ్ముడయ్యాయన్న టాక్ వినిపిస్తోంది.

తెలుగు వర్షన్ ను 5 కోట్లకు స్టార్ మా సొంతం చేసుకోగా.. హిందీ డబ్బింగ్ రైట్స్ సోనీ నెట్ వర్క్ 7 కోట్లకు సొంతం చేసుకుంది. బోయపాటి గత చిత్రం సరైనోడు హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో రికార్డ్ లు క్రియేట్ చేయటంతో జయ జానకి నాయకను భారీ మొత్తానికి తీసుకునేందుకు సోని సంస్థ ముందుకు వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement