
జయ జానకి నాయక టీజర్ : ఆ మార్క్ మిస్సైంది
సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం జయ జానకి నాయక. సూపర్ హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈసినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. తన ప్రతీ సినిమాను మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రమోట్ చేసే బోయపాటి ఈ సినిమాను మాత్రం లవ్ స్టోరిగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు.
ఫస్ట్ లుక్ను కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ అనిపించేలా డిజైన్ చేసిన చిత్రయూనిట్ టీజర్ను కూడా అదే స్టైల్లో రిలీజ్ చేసింది. బోయపాటి మార్క్ యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ఒక్కటి కూడా లేకుండానే కూల్ కాలేజ్ లవ్ స్టోరీలా టీజర్ను కట్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాలేజ్ స్టూడెంట్గా కనిపిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.