300 మంది లండన్ డ్యాన్సర్స్తో ఆట, పాట..! | 3 crores Beach song in jaya janaki nayaka | Sakshi
Sakshi News home page

300 మంది లండన్ డ్యాన్సర్స్తో ఆట, పాట..!

Published Thu, Jul 20 2017 12:42 PM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

300 మంది లండన్ డ్యాన్సర్స్తో ఆట, పాట..! - Sakshi

300 మంది లండన్ డ్యాన్సర్స్తో ఆట, పాట..!

అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తొలి సినిమాతో పరవాలేదనిపించినా.. రెండో సినిమాతో నిరాశపరిచాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమాలో నటిస్తున్నాడు శ్రీనివాస్. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాను మిరియాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఒక పాట కోసం ఏకంగా మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీలో డిస్కో బాబు డిస్కో బాబు అనే ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. వైజాగ్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ పాట షూట్ లో 300 మంది లండన్ డ్యాన్సర్ లు పాల్గొంటున్నారు. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ వేసిన సెట్ లో షూటింగ్ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement