ఒక్క సీన్ కోసం 20 టేకులు, 3 రోజులు | Jagapathi babu took 20 retakes and 3 days of time to say one dialogue | Sakshi
Sakshi News home page

ఒక్క సీన్ కోసం 20 టేకులు, 3 రోజులు

Published Wed, Aug 2 2017 12:18 PM | Last Updated on Mon, Sep 11 2017 11:06 PM

Jagapathi babu took 20 retakes and 3 days of time to say one dialogue

సీనియర్ నటుడు జగపతిబాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా ఎన్నో విజయాలు సాధించిన జగ్గుబాయ్, ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్నాడు. తన అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులు రివార్టులు సొంతం చేసుకున్న ఈ విలక్షణ నటుడు, తన రీసెంట్ సినిమా ఎక్స్ పీరియన్స్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన సినిమా జయ జానకి నాయక. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కీలకమైన ఓ సన్నివేశం కోసం బోయపాటి చెప్పిన ఎక్స్ప్రెషన్ ను జగ్గుబాయ్ ఇవ్వలేకపోయాడట. మూడు రోజుల పాటు 20 టేకులు చేసినా.. అనుకున్న ఎక్స్ప్రెషన్ రాకపోవటంతో డబ్బింగ్, ఎడిటింగ్ లలో ఆ సన్నివేశాన్ని ఎడ్జస్ట్ చేశారని తెలిపాడు. ప్రస్తుతం ఆ సీన్ ఎంటో చెప్పకపోయినా.. అదే డైలాగ్ ను సినిమా సక్సెస్ మీట్ లో ప్రేక్షకుల ముందుకు చెప్తానని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement