సెన్సార్ పూర్తి చేసుకొన్న 'జయ జానకి నాయక' | Jaya Janaki Nayaka censor Completed | Sakshi
Sakshi News home page

సెన్సార్ పూర్తి చేసుకొన్న 'జయ జానకి నాయక'

Published Wed, Aug 2 2017 5:11 PM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

సెన్సార్ పూర్తి చేసుకొన్న 'జయ జానకి నాయక' - Sakshi

సెన్సార్ పూర్తి చేసుకొన్న 'జయ జానకి నాయక'

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'జయ జానకి నాయక'. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

క్లాస్-మాస్ ఆడియన్స్ను ఆకట్టుకొనే విధంగా దేవి తనదైన మార్క్ తో రెడీ చేసిన ఆడియో జూలై 31న అంగరంగ వైభవంగా సినీ ప్రముఖుల సమక్షంలో విడుదలైన సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న 'జయ జానకి నాయక' సెన్సార్ నేడు(02-08-2017) పూర్తయ్యింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి 'యు/ఎ' సర్టిఫికెట్ లభించింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ మాట్లాడుతూ.. 'ఏ విషయంలోనూ రాజీపడకుండా జయ జానకి నాయక చిత్రాన్ని రూపొందిస్తున్నాము. సినిమా విజువల్స్ గ్రాండియర్ తెలుగు సినిమాకు బెంచ్ మార్క్ లా నిలిచిపోతాయి. ఇవాళ సెన్సార్ పూర్తయ్యింది, సినిమా చూసిన సెన్సార్ సభ్యులు 'యు/ఎ' సర్టిఫికెట్ ను అందించారు. క్లీన్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన జయ జానకి నాయక చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్న పూర్తి నమ్మకం మాకుంది' అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement