బెల్లంకొండ కెరీర్‌ బెస్ట్‌ ‘సాక్ష్యం’ | Saakshyam to emerge as the biggest hit of Bellamkonda Sreenivas | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 31 2018 11:38 AM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

Saakshyam to emerge as the biggest hit of Bellamkonda Sreenivas - Sakshi

యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం సాక్ష్యం. జూలై 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి వీకెండ్‌లోనే 40 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన శ్రీనివాస్ కెరీర్‌లోనే బిగెస్ట్‌ ఓపెనర్‌గా నిలిచింది. పుల్‌ రన్‌లో ‘సాక్ష్యం’ బెల్లంకొండ శ్రీనివాస్‌ గత చిత్రాల రికార్డ్‌లను తిరగరాస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  ఈ యంగ్ హీరో తొలి చిత్రం అల్లుడు శీను పుల్‌రన్‌లో 70 కోట్ల గ్రాస్ వసూళు చేయగా జయ జానకి నాయక దాదాపు 80 కోట్ల గ్రాస్ సాదించింది. ఇప్పుడు సాక్ష్యం ఆ రెండు చిత్రాల కలెక్షన్లు దాటేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్‌.

పంచ భూతల నేపథ్యంలో యాక్షన్‌ డ్రామగా తెరకెక్కిన సాక్ష్యం సినిమా బీసీ సెం‍టర్లలో మంచి వసూళ్లు సాదిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సాయి శ్రీనివాస్‌ నటనకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. శ్రీవాస్‌ దర్శకత్వంలో అభిషేక్‌ నామా నిర్మించిన ఈ సినిమాకు హర్షవర్థన్ రామేశ్వర్‌ సంగీతమందించాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా లో జగపతి బాబు, మీనా, శరత్‌ కుమార్‌, జయప్రకాష్‌, అశుతోష్ రానా, రవికిషన్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement