ఆలస్యంగా ‘సాక్ష్యం’ | Bellamkonda Sreeniva Saakshyam' release postponed? | Sakshi
Sakshi News home page

ఆలస్యంగా ‘సాక్ష్యం’

May 29 2018 2:14 AM | Updated on Aug 22 2019 9:35 AM

Bellamkonda Sreeniva Saakshyam' release postponed? - Sakshi

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సాక్ష్యం’. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముందుగా ‘సాక్ష్యం’ సినిమాను జూన్‌ 14న రిలీజ్‌ చేయాలనుకున్నారు. సినిమాకు సంబంధించిన సీజీ వర్క్‌ కంప్లీట్‌ కాకపోవడంతో రిలీజ్‌ డేట్‌ను జూలై 20కు పోస్ట్‌ పోన్‌ చేశారు. కొత్త రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేస్తూ –‘‘బాహుబలి’ సినిమాకు వర్క్‌ చేసిన సీజీ టీమ్‌ ‘మకుట’ మా సినిమాకు వర్క్‌ చేస్తోంది. సినిమా పంచభూతల చుట్టూ తిరుగుతుంది. దర్శకుడు ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్నారు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్‌ కాకపోవడంతో కొంచెం డిలే అయింది. ప్రపంచవ్యాప్తంగా మా సినిమాను జూలై 20న రిలీజ్‌ చేస్తున్నాం. టీజర్, ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్, కెమెరా: ఆర్థర్‌ ఎ.విల్సన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement