‘సాక్ష్యం’ విడుదల వాయిదా! | Is Bellamkonda Srinivas Saakshyam Movie Postponed | Sakshi
Sakshi News home page

Published Sat, May 26 2018 2:47 PM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

Is Bellamkonda Srinivas Saakshyam Movie Postponed - Sakshi

‘జయ జానకి నాయకా’ సినిమాతో హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ మంచి జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ యువహీరో తన తదుపరి చిత్రం సాక్ష్యం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌, లుక్స్‌, సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. 

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం విడుదల వాయిదా పడిందని టాక్‌ వినిపిస్తోంది. జూన్‌ 14న సాక్ష్యంను విడుదల చేస్తామని చిత్రయూనిట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఈ చిత్రం జూలైలో విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారక ప్రకటన మాత్రం విడుదల కాలేదు. శ్రీవాస్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement