
బెల్లంకొండ సాయి శ్రీనివాస్
నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశాలను పంచభూతాలు అంటారు. ఓ సంఘటనకు ఈ పంచభూతాలు ఎలా సాక్ష్యంగా నిలిచాయి అనే అంశాల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సాక్ష్యం’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 14న రిలీజ్ కానుంది. నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘కమర్షియల్ ఎలిమెంట్స్‌కు ప్రకృతినే కేంద్రబిందువుగా చేసుకుని సరికొత్త యాంగిల్‌లో శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.
శ్రీనివాస్ మేకోవర్, టెక్నికల్ అంశాలు, గ్రాఫిక్స్ సినిమాకు హైలైట్. దుబాయ్, వారణాసి, అమెరికాలోని లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపాం. శుక్రవారం రాజమండ్రిలో మొదలైన కొత్త షెడ్యూల్‌తో షూటింగ్‌ను కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది’’ అన్నారు. జగపతిబాబు, శరత్‌కుమార్, మీనా, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు మాటలు: సాయి మాధవ్ బుర్రా, సంగీతం: హర్షవర్ధన్.