బెల్లంకొండ సాయి శ్రీనివాస్
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన యంగ్ హీరో సాయి శ్రీనివాస్. తొలి సినిమా అల్లుడు శీనుతోనే వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్, సమంత లాంటి టాప్ హీరోయిన్‌తో కలిసి పని చేశాడు శ్రీనివాస్. అంతేకాదు ఈ సినిమాలో తమన్నాతో స్పెషల్ సాంగ్ లో ఆడిపాడాడు. ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్‌తో జోడి కట్టి తొలి కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నాడు.
ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాక్ష్యం సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు శ్రీనివాస్ ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సాక్ష్యం తరువాత చేయబోయే రెండు సినిమాలను ఇప్పటికే ఫైనల్ చేశాడు శ్రీనివాస్. ఓంకార్ దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు కొత్త దర్శకుడు నానిని పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కాజల్ హీరోయిన్‌గా నటించనుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment