
పూజా హెగ్, బెల్లంకొండ శ్రీనివాస్
బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాక్ష్యం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. 15రోజుల షెడ్యూల్‌లో ఓ సాంగ్‌ను, కొన్ని సీన్స్ అమెరికాలోని న్యూయార్క్, గ్రాండ్ కెన్యాన్, న్యూ జెర్సీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరించనున్నారు.
అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. మే 11న సినిమా విడుదల చేయనున్నారు. జగపతిబాబు, మీనా, శరత్ కుమార్, ‘వెన్నెల’ కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: హర్షవర్ధన్, కెమెరా: ఆర్థర్ ఎ.విల్సన్.