
జయ జానకీ నాయక సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రకృతిలోని పంచభూతాల ఆధారంగా తెరకెక్కుతుండటం, ఇప్పటికే రిలీజైన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది.
ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపించింది. కానీ చిత్రయూనిట్ ఫస్ట్‌లుక్ ను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్, మీనా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.