డిక్టేటర్ షూటింగ్ 29న ప్రారంభం | Balakrishna's 99th film to be launched on May 29 | Sakshi
Sakshi News home page

డిక్టేటర్ షూటింగ్ 29న ప్రారంభం

Published Sat, May 16 2015 12:15 PM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

డిక్టేటర్ షూటింగ్ 29న ప్రారంభం

డిక్టేటర్ షూటింగ్ 29న ప్రారంభం

హైదరాబాద్: సింహా... లెజెండ్... లయన్ చిత్రాలలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు డిక్టేటర్గా కనిపించనున్నాడు. బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రం డిక్టేటర్ షూటింగ్ మే 29వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఆ చిత్ర దర్శకుడు శ్రీవాస్ శనివారం హైదరాబాద్లో వెళ్లడించారు. కాగా చిత్రం రెగ్యులర్ షూటింగ్ మాత్రం జూన్ 12  నుంచి మొదలవుతుందని తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీతోపాటు యూరప్ దేశాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటుందని చెప్పారు.

ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార నటిస్తుందని చెప్పారు. బాలకృష్ణతో నయనతార నటిస్తున్న మూడో చిత్రం అని శ్రీవాస్ పేర్కొన్నారు. గతంలో బాలకృష్ణ, నయనతార కాంబినేషన్లో సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. తన దర్శకత్వంలో వచ్చిన లక్ష్యం, లౌక్యం చిత్రాలు విజయం సాధించాయి.... అలాగే ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని శ్రీవాస్ స్పష్టం చేశారు. ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారని శ్రీవాస్ తెలిపారు. డిక్టేటర్ చిత్రాన్ని ఈ ఏడాది దసరా పండగకు విడుదల చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement