బెల్లంకొండ కొత్త సినిమా అప్ డేట్స్ | bellamkonda srinivas, Sriwass movie shooting update | Sakshi
Sakshi News home page

బెల్లంకొండ కొత్త సినిమా అప్ డేట్స్

Published Tue, Oct 3 2017 10:56 AM | Last Updated on Tue, Oct 3 2017 10:56 AM

bellamkonda srinivas, Sriwass movie shooting update

టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్, యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సెన్సేషనల్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.

ఇటీవలే వారణాసిలో 15 రోజుల యాక్షన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకొన్న ఈ చిత్ర విశేషాల గురించి చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. 'ఆ శివుని ఆశీస్సులతో వారణాసి షెడ్యూల్ పూర్తయ్యింది. పీటర్ హెయిన్స్ సారధ్యంలో కాశీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో ఈ పోరాట సన్నివేశాలను పిక్చరైజ్ చేశాం.

హీరోహీరోయిన్లు బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజా హెగ్డేలతోపాటు జయప్రకాష్, సూర్య, అశుతోష్ రాణా, పవిత్ర లోకేష్ వంటి ఆర్టిస్టులు కూడా పాల్గొన్న ఈ షెడ్యూల్ లో కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ కూడా తీశాం. బలమైన కథా కథనాలతో టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ ఈ మూవీ రూపొందుతోంది. శ్రీవాస్  చాలా సమయం వెచ్చించి ఈ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు, తెలుగులో ఇది చాలా డిఫరెంట్ మూవీగా నిలిచిపోతుంది. ఆడియన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం చిత్ర బృందమంతా కష్టపడి పనిచేస్తోంది' అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement