యాభై రోజుల వేడుకలు చూసి ఎన్నాళ్లయ్యిందో! | Loukyam Movie 50 Days Celebrations | Sakshi
Sakshi News home page

యాభై రోజుల వేడుకలు చూసి ఎన్నాళ్లయ్యిందో!

Published Mon, Nov 17 2014 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

యాభై రోజుల వేడుకలు చూసి ఎన్నాళ్లయ్యిందో!

యాభై రోజుల వేడుకలు చూసి ఎన్నాళ్లయ్యిందో!

 ‘‘దాదాపు ఏడాదిన్నర పాటు ‘లౌక్యం’ చిత్ర కథపై కసరత్తులు చేశాం. దానికి తగ్గ ప్రతిఫలం లభించింది. గోపీచంద్‌కి ఇది సొంత సంస్థ లాంటిది. విదేశాల్లో ఈ చిత్రం పాటలు చిత్రీకరించినప్పుడు గోపీచంద్ తానే నిర్మాతలా, ప్రొడక్షన్ మేనేజర్‌లా దగ్గరుండి చూసుకున్నారు’’ అన్నారు చిత్ర నిర్మాత వి. ఆనందప్రసాద్. గోపీచంద్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘లౌక్యం’ చిత్ర అర్ధశతదినోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ‘‘ఇన్నాళ్లూ నేను లౌక్యంగా మాట్లాడింది లేదు. కానీ, ఈ చిత్రం చూసిన తర్వాత మాట్లాడక తప్పడం లేదు. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీలో గోపీచంద్ అద్భుతంగా నటించాడు. రకుల్ అందంగా ఉంది.
 
 కోన వెంకట్, గోపీమోహన్ వినోదానికి మారుపేరు అనిపించుకున్నారు ‘అన్నమయ్య’ చిత్రానికి నా దగ్గర పని చేసిన శ్రీవాస్ ఈ చిత్రాన్ని గొప్పగా తీశాడు’’ అన్నారు. యాభై రోజుల పండగలు చూసి ఎన్నాళ్లయ్యిందో... ఇలాంటి వేడుకలు చాలా జరగాలని కోరుకుంటున్నానని శ్రీకాంత్ చెప్పారు. గోపీచంద్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రం రూపొందడానికి ప్రధాన కారకుడు ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. ఈ మూడూ సినిమాకి ప్లస్ అయ్యాయి. శ్రీవాస్ చాలా లౌక్యంగా ఈ చిత్రం తీశాడు’’ అన్నారు. హీరోయిన్‌ని బాగా చూపించావని రాఘవేంద్రరావుగారు ప్రశంసిస్తే, దాసరిగారు అభినందిస్తూ మా యూనిట్ అందరికీ పుష్పగుచ్ఛాలు పంపించారని శ్రీవాస్ చెప్పారు. పంపిణీదారులుగా మారిన తనకు, శ్రీధర్ సీపాన, శ్రీవాస్‌కు ఈ చిత్రం మంచి అనుభూతిని మిగిల్చిందని రచయిత కోన వెంకట్ తెలిపారు. ఈ వేడుకలో అన్నేరవి, రచయిత శ్రీధర్ సీపాన, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement