
మా నాన్నే పుట్టారు!
గోపీచంద్ పుత్రోత్సాహంలో మునిగి తేలుతున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన భార్య రేష్మ మగ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. ‘‘‘లౌక్యం’ విజయోత్సాహంలో ఉన్న మా ఇంట బాబు రాక ఆ ఆనందాన్ని రెట్టింపు చేసింది. మా నాన్నే పుట్టారు’’ అని గోపీచంద్ సంబరపడిపోయారు. నేటి భారతం, ప్రతిఘటన, రేపటి పౌరులు లాంటి ఎన్నో సంచలన చిత్రాలు తీసిన ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ కుమారుడే గోపీచంద్ అనే విషయం తెలిసిందే.