
Happy Birthday Gopichand: మ్యాచో స్టార్ గోపీచంద్.. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. సొంత టాలెంట్ తో...తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. హీరోగా నిలదొక్కుపోవడానికి చాలానే కష్టపడ్డాడు. తొలి సినిమా ‘తొలివలపు’ ఫ్లాప్ కావడంతో గోపీచంద్ డైలామాలో పడ్డాడు. మళ్ళీ ఎలాగోలా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని విలన్ పాత్రలు చేయడానికి ఒప్పుకున్నాడు.
తేజ దర్శత్వంలోతెరకెక్కిన ‘జయం’సినిమాలో విలన్‌గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరవాత వర్షం, నిజం సినిమాల్లోనూ విలన్‌గా మెప్పించాడు. యజ్ఞం సినిమాతో హీరోగా రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా హిట్ కావడంతో గోపీచంద్ ఇక వెనుదిరిగి చూసూకోలేదు. ‘రణం, లక్ష్యం, గోలీమార్ అంటూ వరుస బాక్సాఫీస్ హిట్స్ తో స్టార్ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ ‘సిటీమార్’, ‘పక్కా కమర్షియల్’ చిత్రాల్లో నటిస్తున్నాడు.
ఇక గోపీచంద్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయన వివాహం 2013లో రేష్మతో జరిగింది. రేష్మ ఎవరో కాదు.. ప్రముఖ హీరో శ్రీకాంత్ కు స్వయానా మేనకోడలు. శ్రీకాంత్ సొంత అక్క కూతురిని గోపీచంద్ కి ఇచ్చి వివాహం జరిపించారు. ఆమె అమెరికాలో చదివింది. ఆమె ఫోటో చూసి ఇష్టపడిన గోపిచంద్.. సీనియర్ యాక్టర్ చలపతిరావుతో సంబంధం మాట్లాడమని చెప్పాడట. ఆయన శ్రీకాంత్ దగ్గర పెళ్లి విషయాన్ని ప్రస్తావించి ఒప్పించాడట. గోపీచంద్ తన కంటే మంచోడు అని.. కళ్లు మూసుకొని పెళ్లి చేసుకోవచ్చని స్వయంగా హీరో శ్రీకాంత్ చెప్పడంతో వీరి పెళ్లి పీటలమీదకు చేరిందట. వీరికి ఇద్దరు కొడుకులు. తన భార్య కోరిక ప్రకారం వారికి 'విరాట్ కృష్ణ', 'వియాన్' అనే పేర్లు పెట్టామని ఓ ఇంటర్వ్యూలో గోపిచంద్ చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment