డబుల్‌ హ్యాపీ | Once Again Gopichand Become Father | Sakshi
Sakshi News home page

డబుల్‌ హ్యాపీ

Published Sat, Sep 15 2018 12:54 AM | Last Updated on Sat, Sep 15 2018 12:54 AM

Once Again Gopichand Become Father - Sakshi

గోపీచంద్‌

వినాయకచవితి పండగ సెలబ్రేషన్స్‌ నటుడు గోపీచంద్‌ ఇంట్లో ఒక రోజు ముందే మొదలయ్యాయి. గురువారం పండగ రోజు డబుల్‌ అయ్యాయి. ఇంతకీ... విషయం ఏంటంటే... గోపీచంద్‌ రెండోసారి తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు. ‘‘బేబి బాయ్‌కి తండ్రి అయ్యాను. పండగను మించిన సంతోషం కలుగుతోంది’’ అని గోపీచంద్‌ పేర్కొన్నారు.

దాదాపు ఐదేళ్ల క్రితం రేష్మాను వివాహం చేసుకున్నారు గోపీచంద్‌. ఈ దంపతులకు 2014లో కలిగిన మగ సంతానానికి విరాట్‌ కృష్ణ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికోస్తే... ఇటీవల ‘పంతం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు గోపీచంద్‌. ఇప్పుడు గోపీచంద్‌ హీరోగా కుమార్‌ అనే కొత్త దర్శకుడి నేతృత్వంలో ఓ సినిమా రూపొందనుందని టాక్‌. అలాగే దర్శకుడు సంపత్‌ నంది వినిపించిన ఓ స్టోరీ లైన్‌కు గోపీచంద్‌ ఇంప్రెస్‌ అయ్యారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement