కొత్త దర్శకుడితో గోపిచంద్‌..! | Gopichand Next Movie With Debutant Director | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 30 2018 11:27 AM | Last Updated on Fri, Nov 30 2018 11:27 AM

Gopichand Next Movie With Debutant Director - Sakshi

మాస్‌ హీరోగా పేరు తెచ్చుకున్న గోపిచంద్ వరుస విజయాలు సాధించటంలో ఫెయిల్ అవుతున్నాడు. ఇటీవల గోపిచంద్‌ నుంచి యావరేజ్‌ స్థాయి సినిమా కూడా రాలేదు. దీంతో తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు ఈ మ్యాన్లీ హీరో. తన 25 సినిమాగా పంతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపిచంద్ తదుపరి చిత్రాన్ని కొత్త దర్శకుడితో చేసే ఆలోచనలో ఉన్నాడు.

అనిల్‌ సుకంర నిర్మాణలో తిరు సుబ్రహ్మాణ్యాన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను డిసెంబర్‌లోనే ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు గోపిచంద్‌. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement