సినిమా ఇండస్ట్రీలో అడవాళ్లు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య క్యాస్టింగ్ కౌచ్. నీకు ఛాన్స్ ఇస్తాం సరే, మరి నువ్వు మాకేమిస్తావు?.. కాంప్రమైజ్ కాకపోతే నీకు అవకాశాలే రావు.. ఇలాంటి సూటిపోటి మాటలు అడుగడుగడునా వినిపిస్తూనే ఉంటాయి. ఎందరో నటీనటులు ఇటువంటి అడ్డంకులు దాటుకుని ముందుకు వచ్చినవాళ్లే! అందులో ఒకరు బుల్లితెర నటి రేష్మ ప్రసాద్. తాజాగా ఆమె క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. సినిమాల్లోనే కాకుండా సీరియల్స్‌లోనూ కాంప్రమైజ్ అడుగుతారని చెప్పుకొచ్చింది.
గుర్తింపు రాని చిన్న రోల్స్‌కు సైతం కాంప్రమైజ్..
ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో అడ్జస్ట్‌మెంట్ అనేది చాలా సాధారణ విషయమైపోయింది. గదిలోకి రావడానికి అడ్జస్ట్ అవుతావా? అని చాలా సింపుల్‌గా అడిగేస్తారు. కొన్ని అప్లికేషన్ ఫామ్స్‌లో అయితే అడ్జస్ట్‌మెంట్‌కు ఒప్పుకుంటున్నావా? అని ప్రత్యేకంగా ఓ కాలమ్ కూడా ఉంటోంది. ప్రధాన పాత్రలకే కాదు, సైడ్ క్యారెక్టర్లు, అసలు గుర్తింపు రాని చిన్నాచితకా పాత్రలకు కూడా కాంప్రమైజ్ అడుగుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ మహమ్మారి వల్ల నిజమైన ప్రతిభావంతులు భయంతో వెనకడుగు వేస్తున్నారు.
ఒప్పుకునేవరకు ఒత్తిడి.. లొంగిపోయా
అప్లికేషన్ ఫామ్‌లో అడ్జస్ట్‌మెంట్‌కు ఒప్పుకోవడం లేదని రాసినా సరే మళ్లీ అదే టాపిక్ తీసుకొచ్చి ఒత్తిడి చేస్తారు. మంచి పాత్ర కోసం, ఫేమ్ కోసం, కన్న కలలు సాకారం చేసుకోవడం కోసం ఆ ఒత్తిడికి లొంగిపోతాం. గతంలో నేను కూడా ఓసారి ఒత్తిడి తట్టుకోలేక నా కెరీర్ కోసం అడ్జస్ట్‌మెంట్‌కు ఒప్పుకున్నాను. ఈ విషయం నేనెందుకు చెప్తున్నానంటే ఇండస్ట్రీలో వాస్తవంగా ఏం జరుగుతుందో అందరికీ తెలియాలి. తెరపై తమను తాము చూసుకోవాలని ప్రయత్నాలు చేసేవారికి ఇప్పటికైనా మంచి వాతావరణం కల్పించాలి' అని కోరుతోంది రేష్మ.
చదవండి: ఓటీటీలో 13 సినిమాలు, సిరీస్‌ల సందడి.. ఏవేవి ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..
Comments
Please login to add a commentAdd a comment