Actress Regina Cassandra Also Faced Casting Couch - Sakshi
Sakshi News home page

Regina : సినిమా ఛాన్స్‌ అడిగితే.. అడ్జస్ట్‌మెంట్‌ కావాలని కోరాడు: రెజీనా

Aug 17 2023 1:46 PM | Updated on Aug 17 2023 2:49 PM

Regina Cassandra Also Faced Casting Couch - Sakshi

చెన్నై బ్యూటీ రెజీనా తొలుత కోలీవుడ్‌లో నట పయనాన్ని ప్రారంభించి ఆ తరువాత టాలీవుడ్‌ తదితర దక్షిణాది భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2005లో కండనాళ్‌ మొదల్‌ తమిళ చిత్రంతో కథానాయికగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం విజయంతో ఇక్కడ మరికొన్ని చిత్రాలు అవకాశాలను రాబట్టుకుంది. కానీ కోలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను అందుకోలేకపోయింది. అయితే టాలీవుడ్‌లో ఈమె యువ కథానాయకులతో జత కట్టి మంచి పేరునే తెచ్చుకుంది. తెలుగులోనే ఎక్కువ చిత్రాలు చేస్తోంది. ఇటీవల అవకాశాలు తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. దీంతో ఈ అమ్మడు వెబ్‌సిరీస్‌ల పైన దృష్టి సారిస్తోంది. తాజాగ  కోలీవుడ్‌లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన రెజీనా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది.

(ఇదీ చదవండ: ఏపీలో పవన్‌ పొలిటికల్‌ భవిష్యత్‌పై మంచు విష్ణు కామెంట్‌!)

రెజీనా తన పదిహేడేళ్ల వయసులో వెండితెరకు పరిచయం అయింది. ఆ సమయంలో చాలా మంది నుంచి చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపింది. 'నా సినీ కెరియర్‌ ప్రారంభంలో  అవకాశాల కోసం కొందరిని సంప్రదించాను. దాంతో ఓ వ్యక్తి నాకు ఫోన్ చేసి ఛాన్స్ ఇస్తానని అడ్జస్ట్‌మెంట్‌కి ఓకే చెబితే తర్వాత వెంటనే షూటింగ్‌ పని చూసుకోవచ్చన్నాడు. ఇది జరిగి ఇప్పటికి సుమారు 10 సంవత్సరాలు అయింది. నా వయసు అప్పుడు కేవలం 20 ఏళ్లు. అతని మాటల పట్ల నాకు సరైన అవగాహన లేదు. అడ్జస్ట్‌మెంట్‌ అంటే ఏమిటో కూడా తెలియదు. రెమ్యునరేషన్‌ విషయంలో అడుగుతున్నారేమోనని, సరే నా మేనేజర్ నీతో మాట్లాడతారని ఫోన్‌ కట్‌ చేశాను.' అని రెజీనా తెలిపింది.

(ఇదీ చదవండి:  టైగర్‌ కా హుకూం ఈ విషయం తెలుసా.. ? జైలర్‌ సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే)

తర్వాత మేనేజర్‌ ద్వారా అసలు విషయం తెలిసింది. ఆ ఫోన్‌ చేసిన వ్యక్తి  వేరే రకమైన కోరిక కోరాడని ఆర్థమైంది.  ఆ సంఘటన తర్వాత మళ్లీ అలాంటి అనుభవం ఎదురుకాలేదు. అయితే కొందరు నటీమణులు మాత్రం ఇలాంటి ఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని నిజం కావచ్చు, కొన్ని అబద్ధం కావచ్చు. కొంత మంది నటీమణులు ఫేమ్‌ కోసం అబద్ధాలు కూడా చెబుతారు. నిజం ఏమిటో వారికి మాత్రమే తెలుసు అని రెజీనా అన్నారు. ప్రస్తుతం రెజినీ వెబ్‌ సీరిస్‌లతో పాటు పలు తమిళ సినిమాలతో బిజీగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement